శుభవార్త.. ధర్నా విరమించిన ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు..
దేశంలోని పెట్రోల్ బంకుల్లో భారీగా రద్దీ పెరిగింది. ఆయిల్ ట్యాంకర్ యజమానులు స్ట్రైక్ చేయడంతో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిండుకున్నాయి. ఆయిల్ ట్యాంకర్ యజమానులు ధర్నా చేస్తున్న విషయం వాహనాదారులు భారీగా పెట్రోల్ బంకులకు చేరుకున్నారు. దీంతో పెట్రోల్ బంకుల్లో భారీగా రద్దీ పెరిగింది. ప్రభుత్వం ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లతో చర్చలు జరిపింది. దీంతో ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు ధర్నా విరమించారు.
దీంతో పెట్రోల్, డీజిల్ లోడులతో చర్లపల్లిలోని డిపోల నుంచి ట్యాంకర్లు బంకులకు వెళ్తున్నాయి. ఇవి బంకులకు చేరేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో కొద్దిసేపు అక్కడ వాహనదారుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇవాళ ఉదయం నుంచి బంకుల వద్ద వాహనదారులు ఇంధనం కోసం బారులు తీరిన సంగతి తెలిసిందే. భారత న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి జైలు శిక్షను ఇటీవల కేంద్రం భారీగా పెంచింది.

హిట్ అండ్ రన్ కేసులో రూ.10 లక్షల ఫైన్ తో పాటు గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్షను పెంచుతూ చట్టం చేసింది. దీనికి నిరసనగా ఆయిల్ ట్యాంకర్ల ఓనర్లు, డ్రైవర్లు సోమవారం(జనవరి 1) నుంచి ధర్నాకు దిగారు. దీంతో హైదరాబాద్‌లోని పెట్రోల్ బంకులకు ఇంధన సరఫరా నిలిచిపోయిన సంగతి తెలింది. దీంతో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు. దీంతో చాలా చోట్ల నో స్టాక్ బోర్డు పెట్టారు.
మంగళవారం సాయంత్రం ఆయిల్ ట్యాంకర్లు ధర్నా విరమించినట్లు ప్రకటన చేయడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ వీరి ధర్నా వారం పాటు జరిగింటే తీవ్ర పరిస్థితులు ఎదుర్కొవాల్సి వచ్చేది.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications