వీడు ఓలా క్యాబ్ డ్రైవర్: ఇద్దరిపై రేప్, ఓ బాలికను చేతలూ కాళ్లూ కట్టేసి..
Recommended Video

హైదరాబాద్: ఓలా క్యాబ్ డ్రైవర్ ముసుగులో మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న కామాంధుడిని పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్‌లోని కుషాయిగుడా పోలీసులు అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.
శనివారంనాడు ఓ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతన్ని పోలీసులు పట్టుకున్నారు. పోలీసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఓలా క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న నిందితుడు కందుకూరి నాగమణి కిరణ్ ఇప్పటి వరకు పది మంది యువతులను వేధించాడు.

ఇద్దరిపై అత్యాచారం చేశాడు. పదేళ్ల బాలికపై కూడా వేధింపులకు పాల్పడ్డాడు. డోర్ లాక్ చేసి అతుడు అఘాయిత్యాలకు పాల్పడుతూ వచ్చాడు. అయితే బాధితుల్లో ఇప్పటి వరకు ఒక్కరు మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శనివారంనాడు అతను ఓ యువతిపై అత్యాచార యత్నం చేశాడు గట్టిగా అరిచి, అతడి నుంచి తప్పించుకుని బాధితాురాలు పారిపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
రాత్రిపూట బస్టాప్ వద్ద ఒంటరిగా ఉన్న యువతికి లిఫ్ట్ ఇస్తానని చెప్పి అతను అసభ్యంగా ప్రవర్తించాడు లాలాపేట శాంతినగర్‌కు చెందిన కిరణ్ ఈ నెల 5వ తేదీన కాప్రా పరిధిలోని రాధిక థియేటర్ చౌరస్తా వద్ద రాత్రి దాదాపు 11 గంటల సమయంలో ఓ మహిళ ఒంటరిగా వేచి చూస్తుండడాన్ని అతను గుర్తించాడు.
ఆమెను మాటల్లోకి దింపి సైనిక్‌పురి వరకు లిప్ట్ ఇస్తానని చెప్పి క్యాబ్‌లో ఎక్కించుకున్నాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత కారును దారి మళ్లించాడు. ఎఎస్ రావునగర్ పార్కు వద్దకు తీసుకుని వెళ్లి కారు డోర్లు లాక్ చేసాడు. ఆ తర్వాత మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
ఆమె పెద్దగా కేకలు వేయడంతో కారులోంచి దింపి అక్కడి నుంచి పారిపోయాడు.. దీనిపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సిసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా క్యాబ్ డ్రైవర్‌ను శనివారంనాడు అదుపులోకి తీసుకుని విచారించారు.
నిరుడు అక్టోబర్ 17వ తేదీన కుషాయిగుడా పోలీసు స్టేషన్ పరిధిలో ఓ బాలికను కిడ్నాప్ చేసినట్లు అతను పోలీసు విచారణలో అంగీకరించాడు. కౌకూర్ వద్దకు బాలికను తీసుకుని వెళ్లి కాళ్లు, చేతులు కట్టేసి లైంగిక దాడికి ప్రయత్నించినట్లు అతను అంగీకరించాడు.












Click it and Unblock the Notifications