క్యాబ్ డ్రైవర్ ను బెదిరించి.. నగదుతో పాటు కారుతో ఉడాయించారు
హైదరాబాద్ : హైదరాబాద్ లోని సూరారం కాలనీ సమీపంలో ఓలా క్యాబ్ డ్రైవర్ ను నిలువునా దోచేసుకున్నారు గుర్తు తెలియని అగంతకులు. క్యాబ్ లో ఎక్కినవాళ్లు కాస్త.. బెదిరింపులకు దిగి నగదు, సెల్ ఫోన్ లాక్కుని క్యాబ్ తో ఉడాయించడంతో క్యాబ్ డ్రైవర్ కంగు తిన్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. వనస్థలిపరంలో కొంతమంది వ్యక్తులు ఓలా క్యాబ్ ను బుక్ చేసుకున్నారు. దీంతో వారిని పికప్ చేసుకుని సూరారం వైపుగా వెళ్తున్నాడు క్యాబ్ డ్రైవర్. ఇంతలో సూరారం సమీపంలోకి చేరుకోగానే కారులో ఉన్న అగంతకులు డ్రైవర్ ను బెదిరించి నగదుతో పాటు సెల్ ఫోన్ లాగేసుకున్నారు.

అనంతరం డ్రైవర్ ను కిందకు దించేసి.. అదే క్యాబ్ లో అక్కడినుంచి ఉడాయించారు. కాగా, కారును బొంగులూరు గేట్ సమీపం నుంచి వెళ్తుండగా గుర్తించినట్లు ఆదిభట్ల పోలీసులు తెలిపారు. ఇదే క్రమంలో కారు యాక్సిడెంట్ కు గురికావడంతో కారును అక్కడే వదిలి దుండగులు పరారైనట్లుగా సమాచారం. ప్రస్తుతం బాధితుడి ఫిర్యాదు మేరకు దుండగులను పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు. ఇంతకుముందు దొంగతనాలకు పాల్పడిన వ్యక్తులే ఇప్పుడు ఈ చోరికి పాల్పడి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications