దారి మళ్లించి మహిళకు వేధింపులు: ఓలా క్యాబ్ డ్రైవర్ అరెస్ట్
నగరంలోని లింగంపల్లిలో ఓ ఓలా క్యాబ్ డ్రైవర్ అరాచకానికి తెగబడ్డాడు. క్యాబ్‌లో ఎక్కిన ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
హైదరాబాద్: నగరంలోని లింగంపల్లిలో ఓ ఓలా క్యాబ్ డ్రైవర్ అరాచకానికి తెగబడ్డాడు.
క్యాబ్‌లో ఎక్కిన ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. లింగంపల్లి నుంచి వనస్థలిపురం వెళ్లేందుకు ఓ మహిళ ఓలా క్యాబ్‌ను బుక్ చేసుకుని ఎక్కింది. అయితే, వనస్థలిపురం వైపు వెళ్లకుండా పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ హైవే వైపు క్యాబ్‌ను మళ్లించాడు డ్రైవర్. ఆ తర్వాత ఆమెపై వేధింపులకు పాల్పడ్డాడు.

దీంతో క్యాబ్‌లో కూర్చున్న ఆ మహిళ పెద్దగా కేకలు వేయడంతో ఆరాంఘర్ వద్ద స్థానికులు ఆ కేకలు విని క్యాబ్‌ను అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారమివ్వడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు క్యాబ్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. క్యాబ్ డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications