కన్నకొడుకుల్ని ఆ స్థితిలో చూసి.. కుప్పకూలిన తండ్రి.. ఆ వెంటనే తల్లి మృతి.. భైంసాలో విషాదం
కొడుకులిద్దరూ జైలుపాలు కావడాన్ని తట్టుకోలేక ఓ వృద్ద జంట ప్రాణాలు కోల్పోయిన ఘటన భైంసాలో విషాదం నింపింది. మత కలహాల కేసులో అరెస్టయిన ఇద్దరు కొడుకుల్ని కోర్టులో పోలీసు బేడీలతో చూసి తట్టుకోలేక ఆ తండ్రి అక్కడే కుప్పకూలిపోయాడు. కొద్ది నిమిషాల వ్యవధిలో తల్లి కూడా గుండెపోటుతో చనిపోయింది. వీళ్లిద్దరి అంత్యక్రియలకు మతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో జనం పాలుపంచుకున్నారు.

అసలేం జరిగిందంటే..
ఇటీవల మున్సిపల్ ఎన్నికల సందర్భంలో భైంసా పట్టణంలో మత ఘర్షణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆ గొడవలకు సంబంధించిన కేసుల్లో అరెస్టయినవారిలో అబ్దుల్ ఖషీఫ్(24), అబ్దుల్ ఆసిఫ్(21) అనే ఇద్దరు అన్నదమ్ములు కూడా ఉన్నారు. ఖషీఫ్ తన తల్లిదండ్రులకు దగ్గరగా నిజామాబాద్ లోని ఓ ఆస్పత్రిలో అసిస్టెంట్ గా, ఆసిఫ్ మాత్రం హైదరాబాద్ లో ప్లంబర్ గా పనిచేసేవాళ్లు. ఈనెల 12 జరిగిన మతకలహాల్లో వీళ్ల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.

కోర్టులో ఆ సీన్ చూసి..
కొడుకుల అరెస్టుపై తండ్రి అబ్దుల్ అహద్ బనార్సీ(73), తల్లి అహ్మదీ బేగం(65) రెండు వారాలుగా బెంగపెట్టుకున్నారు. తమవాళ్లు గొడవల్లో జోక్యం చేసుకోలేదని, బయట నిల్చున్న పాపానికే పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారని ఆ జంట నమ్మింది. మిగతా కుటుంబీకులు, బంధువులు వద్దని వారించినా వినకుండా కొడుకుల్ని చూసేందుకు బన్సారీ దంపతులు బుధవారం భైంసా కోర్టుకు వచ్చారు. ఖషీఫ్, ఆసిఫ్ లు పోలీసు సంకెళ్లతో వాహనం దిగుతున్న సీన్లు చూసి బన్సారీ తల్లడిల్లిపోయాడు. కోర్టు ఆవరణలోనే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు.

గంట వ్యవధిలోనే తల్లి కూడా..
బన్సారీ చనిపోయిన గంటన్నరకే అహ్మదీ బేగం గుండెపోటుకు గురయ్యారు. ఆస్రత్రికి తీసుకెళ్లేలోపే ఆమె కూడా కన్నుమూశారు. కేసుల వ్యవహారం వీళ్ల కుటుంబంలో విషాదం నింపిన తీరు స్థానికుల్ని కలిచివేసింది. బన్సారీ, అతని భార్య అహ్మదీతో అనుబంధమున్న హిందువులు, ఇతర మతస్తులు అంత్యక్రియలకు హాజరై సంతాపాలు తెలిపారు.

మొత్తం 70 మంది అరెస్టు..
గల్లీలో బైక్ స్పీడ్ గా నడపొద్దన్నందుకు మొదలైన వాగ్వాదం పెరిగిపెద్దదై మత కలహాలకు దారి తీయడంతో నిర్మల్ జిల్లాలో భైంసాలో 16 ఇళ్లు, 23 బైక్‌లు, 4 ఆటోలు దగ్ధమైపోయాయి. వీటికి సంబంధించి 20 కేసుల్ని నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి.. రెండు వర్గాలకు చెందిన 70 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications