'ఏటీఎంల నుంచి పాత నోట్లు వస్తున్నాయి, నరేంద్ర మోడీ పతనం ఖాయం'
హైదరాబాద్: బ్యాంకులకు వెళ్తే చిల్లర డబ్బులు ఇవ్వడం లేదని, ఏటీఎంలకు వెళ్తే పాతనోట్లు వస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ పతనం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
పాత కరెన్సీ రద్దు చేసిన నరేంద్ర మోడీ పైన ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. నల్లధనం విషయంలో మోడీ మాటలకు, ప్రజల ఆలోచనలకు చాలా తేడా ఉందని చెప్పారు.
నోట్ల రద్దు విషయమై ఇబ్బందులు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడటం కాదని, ప్రజలలోకి వెళ్తే ఇబ్బందులు తెలుస్తాయని వీ హనుమంత రావు నిప్పులు చెరిగారు. ప్రజలు ఏటీఎంలు, బ్యాంకుల వద్ద ఇబ్బందులు పడుతున్నారన్నారు.

కాగా, బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసేందుకు, చెక్కులను మార్చుకునేందుకు మంగళవారం బ్యాంకుల వద్ద పెద్దసంఖ్యలో జనం బారులు తీరారు. చాలాచోట్ల నగదు మార్చుకోడానికి గంటలపాటు లైన్లో నిలుచుకున్నారు. కౌంటర్ వద్దకు చేరలేని పరిస్థితి.ట
సోమవారం బ్యాంకులకు సెలవు కావడంతో, మంగళవారం విపరీతమైన రద్దీ కనిపించింది. ఏటీఎంలు అన్ని పని చేయడం లేదు. ఒకవేళ డబ్బులు వేసినా అవి ఎక్కువసేపు ఉండటం లేదు. సదుపాయాలు బాగా ఉన్న హైదరాబాద్‌లోనే ఏటీఎంల పనితీరు మెరుగుపడలేదు.
రాష్ట్రంలోని ఇతర పట్టణాలు, గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. తమవంతు వచ్చేసరికి ఏటీఎంలో డబ్బులు ఉంటాయో, లేదో చెప్పలేని పరిస్థితి. దీంతో డబ్బులు బాగా అవసరం ఉన్న కుటుంబాలవారు తమ పనులను పక్కన పెట్టి, ఒక్కొక్కరు ఒక్కో ఏటీఎంల వద్ద నిరీక్షించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications