పాతనోట్ల కలకలం: అతడు నా తమ్ముడు కాదు, మాకెలాంటి సంబంధం లేదు: నటి జీవిత
పాత నోట్లతో పోలీసులకు దొరికిపోయిన శ్రీనివాసరావు తన తమ్మడు కాదని, ఆయనతో తమకెలాంటి సంబంధం లేదని, శ్రీనివాసరావు తన కార్యాలయంతోపాటు ఇతరుల వద్ద కూడా పనిచేస్తున్నారని నటి జీవిత మీడియాకు స్పష్టం చేశారు.
హైదరాబాద్: నగరంలో గురువారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున పాతనోట్లు పట్టుబడటం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో అరెస్టయిన శ్రీనివాసరావు తమకు సన్నిహితుడంటూ వచ్చిన వార్తలపై నటి జీవిత స్పందించారు.
పాత నోట్లతో దొరికిపోయిన శ్రీనివాసరావు తన కార్యాలయంతోపాటు ఇతరుల వద్ద కూడా పనిచేస్తున్నారని, ఆయనతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె మీడియాకు స్పష్టం చేశారు.
ఫిలింనగర్‌లోని శ్రీనివాస ప్రొడక్షన్ కార్యాలయంలో రూ. 7 కోట్ల విలువైన పాత నోట్లు దొరికిన ఘటనలో పోలీసులు శ్రీనివాసరావును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ శ్రీనివాసరావు తన తమ్ముడంటూ మీడియాలో వచ్చిన కథనాలను నటి జీవిత ఖండించారు.

శ్రీనివాసరావు తన తమ్ముడు కాదని, తన తమ్ముడు మురళీ శ్రీనివాస్ నెలరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఆమె తెలిపారు. పోలీసులు అరెస్టు చేసిన శ్రీనివాసరావు తమ ఆఫీసులో మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పారు.
అయితే, అతను తమ ఆఫీసుతోపాటు మరో నాలుగైదు ఆఫీసులలోనూ పని చేస్తున్నాడని, తన వద్ద శ్రీనివాసరావుతోపాటు మరో నలుగురు మేనేజర్లు పని చేస్తున్నారని చెప్పారు. తమ కార్యాలయం ఉన్న భవనంలోనే శ్రీనివాసరావు ఆఫీసు కూడా ఉందని జీవిత వివరించారు.
తమ కార్యాలయం పేరు 'జోత్స్న ప్రొడక్షన్' అని, ప్రస్తుతం 'గరుడవేగ' సినిమాను ఈ సంస్థ తీస్తున్నదని చెప్పారు. పాతనోట్ల వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఈ కేసులో తనకు పోలీసుల నుంచి కూడా ఎలాంటి కాల్ రాలేదని ఆమె చెప్పారు.
ఈ వ్యవహారంతో తమకు సంబంధం ఉందని ఎవరు చెప్పారో చెప్పాలని జీవిత మీడియాను కూడా ప్రశ్నించారు. అరెస్టయిన శ్రీనివాసరావుతో తన తమ్ముడికి కూడా ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు.
శ్రీనివాసరావు తన తమ్మడు కాదని, ఆయనతో తమకెలాంటి సంబంధం లేదని, అతడు తన కార్యాలయంతోపాటు ఇతరుల వద్ద కూడా పనిచేస్తున్నారని నటి జీవిత మీడియాకు స్పష్టం చేశారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications