హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన 12 మందికి కరోనా పాజిటివ్: జీనోమ్ సీక్వెన్స్‌కి నమూనాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ కరోనా వేరియంట్ ఇప్పుడు మనదేశంలోకీ ప్రవేశించింది. మనదేశంలో కర్ణాటకలో తొలిసారి ఈ ఒమిక్రాన్ వేరియంట్ కేసులను గుర్తించారు. దీంతో రాష్ట్రాలన్నీ అప్రమత్తమయ్యాయి. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా టెస్టులను, క్వారంటైన్ చేస్తున్నాయి.

విదేశాల నుంచి వచ్చిన 12 మందికి కరోనా పాజిటివ్

విదేశాల నుంచి వచ్చిన 12 మందికి కరోనా పాజిటివ్

తెలంగాణ ప్రభుత్వం కూడా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిపై అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు చేయడంతోపాటు క్వారంటైన్ చేస్తున్నారు. కాగా, గురు, శుక్రవారాల్లో యూకే, కెనడా, అమెరికా, సింగపూర్ నుంచి వచ్చిన 12 మంది ప్రయాణికులకు కరోనా వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా పాజిటివ్ గా వచ్చిన 12 మందినీ టిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

ఒమిక్రాన్ నేపథ్యంలో జీనోమ్ సీక్వెన్సింగ్‌కు నమూనాలు

ఒమిక్రాన్ నేపథ్యంలో జీనోమ్ సీక్వెన్సింగ్‌కు నమూనాలు

కరోనా బారినపడిన ఆ 12 మంది నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు. కరోనా పాజిటివ్ వచ్చినవారిలో లక్షణాలు కనిపించకపోవడం గమనార్హం. వీరిలో ఒమిక్రాన్ నిర్ధారణ కాకపోతే అందరినీ హోంఐసోలేషన్ పంపనున్నారు. ఇది ఇలావుండగా, విదేశాల నుంచి నగరానికి వచ్చిన ఓ మహిళ(36)కు కరోనా పాజిటివ్ అని తేలింది.

Recommended Video

Omicron Variant : Covaxin May Have Edge - ICMR Officials || Oneindia Telugu
ఓ మహిళకు మొదటి నెగిటివ్.. తర్వాత పాజిటివ్.. టిమ్స్‌కు

ఓ మహిళకు మొదటి నెగిటివ్.. తర్వాత పాజిటివ్.. టిమ్స్‌కు

కుత్బుల్లాపూర్ సర్కిల్ గణేష్ నగర్ సమీపంలోని రిడ్జ్ టవర్స్ కు చెందిన మహిళ బుధవారం లండన్ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అయితే, ఫలితాల్లో ఆమెకు మొదట నెగిటివ్ వచ్చిందని చెప్పి ఎయిర్ పోర్ట్ సిబ్బంది ఇంటికి పంపారు. కానీ, కాసేపటికే తర్వాత రిపోర్ట్స్ ను పరిశీలించిన సిబ్బంది ఆ మహిళకు పాజిటివ్ వచ్చినట్లు గుర్తించి జీడిమెట్ల పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు వెంటనే రిడ్జ్ టవర్స్ అసోసియేషన్ కార్యవర్గానికి సమాచారం అందించి ఆ మహిళకు తెలియజేశారు. ఆ తర్వాత విషయం చెప్పి ఆమెను టిమ్స్ కు తరలించారు. అక్కడ మరోసారి పరీక్షలు నిర్వహించగా.. ఆమెకు కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఆమె నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ విశ్లేషణ కోసం పంపించారు. సదరు మహిళ తల్లిదండ్రులు కూడా హోంఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసు కూడా నమోదు కాలేదని తెలంగాణ వైద్య శాఖ స్పష్టం చేసింది.

English summary
Omicron variant: 12 persons tested coronavirus positive, who returns from foreign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X