పోలీసుల కాల్పులు: చైన్ స్నాచర్లలో ఒకరికి బుల్లెట్ గాయం?
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం ఆటోనగర్ ప్రాంతంలో సోమవారం జరిగిన పోలీసు కాల్పుల్లో తప్పించుకున్న చైన్ స్నాచర్ల కోసం సైబరాబాద్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. చిక్కినట్టే చిక్కి చేజారిన నిందితులను ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు ఎక్కడికక్కడ గాలిస్తున్నారు.
అయితే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు నిందితులలో బైక్‌పై వెనుక కూర్చున్న ఒకరికి బులెట్ట గాయం అయినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఆటోనగర్ నుంచి చింతల్‌కుంట, సాగర్ రింగ్ రోడ్డు, కర్మన్‌ఘాట్ మీదుగా కంచన్‌బాగ్ వైపు స్నాచర్లు పరారైనట్లు సమాచారం.

దీంతో ఆయా మార్గాల్లో ఉన్న అన్ని ఆసుపత్రులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఈ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో నిందితులు చికిత్స పొందుతూ ఉండొచ్చన్న అనుమానంతో అన్ని ఆసుపత్రులను క్షుణ్ణంగా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. వనస్థలిపురం అటోనగర్‌లో ఓ మహిళ మెడలోని గొలుసు లాక్కెళ్లేందుకు యత్నిస్తున్న దుండగులపై అక్కడే వున్న యాంటి చైన్‌స్నాచింగ్ టీం పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.
సోమవారం ఉదయం సంచలనం సృష్టించి సంఘటన వివరాల్లోకి వెళితే.. హుడా సాయినగర్‌లో నివాసం ఉండే అనురాధ(38) భర్తతో కలిసి ఆటోనగర్‌లో హోటల్‌ను నిర్వహిస్తోంది. ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్తుండగా వెనుకనుండి ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని గొలుసును అపహరించుకెళ్లే ప్రయత్నం చేశారు.
దీంతో అక్కడే మఫ్టిలో ఉన్న యాంటి స్నాచింగ్ టీం పోలీసులు వారిని పట్టుకునేందుకు యత్నించగా పారిపోవడంతో వారిపై కాల్పులు జరిపారు. అయితే, చైన్ స్నాచర్లు తప్పించుకుని పారిపోయారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications