Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేసీఆర్ సినిమా పేరుతో ... తెలంగాణ , ఆంధ్రా సెంటిమెంట్స్ తో గేమ్స్ ఆడుతున్న వర్మ !?

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఉద్యమం సాగించిన వైనం ప్రధానాంశంగా రామ్ గోపాల్ వర్మ నిర్మించతలపెట్టిన టైగర్ కేసీఆర్ కు చెందిన ఓ పాట లిరిక్స్ ఇప్పుడు తీవ్ర వివాదం రేపేలా ఉన్నాయి. కొద్దిసేపటి క్రితం ఆయన లిరిక్స్ ను హమ్ చేస్తూ వీడియో విడుదల చేశారు. మా భాష మీద నవ్వినవ్... మా ముఖాల మీద ఊసినవ్... మా బాడీల మీద నడిసినవ్ ఆంధ్రోడా... వస్తున్నా... వస్తున్నా... మీ తాటతీయనీకి వస్తున్నా... అంటూ తాను ప్రకటించిన టైగర్ కేసీఆర్ లోని ఓ సాంగ్ లిరిక్స్ ను వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్వయంగా పాడుతూ వీడియో తీసి యూ ట్యూబ్ లో విడుదల చేశారు. టైగర్ కేసీఆర్ కమింగ్ సూన్ అని కూడా ఆయన అన్నారు.

వివాదాల వర్మ..! ఆంద్రోడా అంటూ మరో వివాదాస్పద పాట విడుదల..!!

వివాదాల వర్మ..! ఆంద్రోడా అంటూ మరో వివాదాస్పద పాట విడుదల..!!

ఐతే ఈ వీడియో చూసిన వారంతా ఇది ఆంధ్రులందరినీ అవమానించేలా ఉందని, ఈ పాటను అంగీకరించేది లేదని కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ తెలంగాణ ఉద్యమం ముగిసింది.. రాష్ట్రం విడిపోయింది. అందరూ ఐకమత్యంగానే ఉంటున్నారు. ఇప్పుడు ఉద్రిక్తతలను రెచ్చగొట్టే విధంగా ఉన్న ఆ పాట ద్వారా రాంగోపాల్ వర్మ ఏ తెలుగు సమాజానికి ఏం చెప్పబోతున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసిన వర్మ రామారావును పొగుడుతూ చంద్రబాబును టార్గెట్ చేసారు. ఇప్పుడు కేసీఆర్ టైగర్ సినిమా ద్వారా చంద్రశేఖర్ రావును హీరో గా చూపించినా, విలన్ గా ఎవరిని చూపిస్తారనేది ప్రశ్నగా మారింది.

 టైగర్ కేసీఆర్ ద్వారా ఏం చెప్తారు..! కేసీఆర్ హీరో ఐతే మరి విలన్ ఎవరు..!!

టైగర్ కేసీఆర్ ద్వారా ఏం చెప్తారు..! కేసీఆర్ హీరో ఐతే మరి విలన్ ఎవరు..!!

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సక్సెస్‌తో తిరిగి ఫాంలోకి వచ్చిన రామ్‌ గోపాల్ వర్మ మరో బయోపిక్‌ తెరకెక్కిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు బయోపిక్‌ను రూపొందిస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించాడు వర్మ. ఈ సినిమాను టైగర్ కేసీఆర్ పేరుతో తెరకెక్కిస్తున్నట్టుగా వెల్లడించాడు.

ఎవరి తాట తీస్తాడు..! తీయించుకోవడానికి సిద్దంగా ఉన్నది ఎవరు..!!

ఎవరి తాట తీస్తాడు..! తీయించుకోవడానికి సిద్దంగా ఉన్నది ఎవరు..!!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా కేసీఆర్‌ బయోపిక్‌ టైగర్‌ కేసీఆర్‌ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు వర్మ. అంతేకాదు వర్మ స్వయంగా సినిమాకు సంబంధించిన పాటను ఆలపిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఈ వీడియోతో తనదైన స్టైల్‌లో వివాదాలకు తెరతీశాడు వర్మ. తలెంగాణ ఉద్యమంలో చంద్రశేఖర్ రావు పోషించిన పాత్ర వరకు చూపిస్తే పరవాలేదు గాని, ప్రతినాయకుల పాత్రలను చిత్రీకరించేప్పుడు తగు జాగ్రత్త తీసుకోకపోతే మళ్లి ఉద్రిక్తలు తలెత్తే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

తెలంగాణ ఉద్యమం ఓ చరిత్ర..! వర్మ దాన్ని ఎలా తెరకెక్కిస్తారు..!!

తెలంగాణ ఉద్యమం ఓ చరిత్ర..! వర్మ దాన్ని ఎలా తెరకెక్కిస్తారు..!!

ఈ సినిమాలో ఏ ఏ పాత్రలు కనిపించబోతున్నాయో కూడా వెల్లడించారు. చంద్రశేఖర్ రావు ఉద్యమ నాయకుడిగా ఉన్న సమయంలో రాష్ట్రరాజకీయాల్లోని కీలక వ్యక్తులంతా ఈ బయోపిక్‌లో కనిపించనున్నారు. కేసీఆర్‌ తనయుడు తారకరామారావు (కేటీఆర్‌), కూతురు కవిత, హరీష్‌ రావు, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. చంద్రబాబు నాయుడు, లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్‌ కుమార్‌, రోశయ్య, కిరణ్ కుమార్‌ రెడ్డి, రామోజీ రావులతో పాటు నారా లోకేష్ పాత్ర కూడా ఈ సినిమాలో ఉంటుందని వర్మ ప్రకటించాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+