టీటీడీపీకి మ‌రో షాక్‌.. గండ్ర స‌త్య‌నారాయ‌ణ రాజీనామా, రేపు కేసీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ఎస్‌లోకి..

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రేవంత్ రెడ్డి గుడ్ బై చెప్పిన తరువాత తెలంగాణ టీడీపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతూనే ఉన్నాయి. టీటీడీపీ నుంచి ఇత‌ర పార్టీలలోకి జంపింగ్‌లు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరో షాక్ తగిలింది.

తెలంగాణ టీడీపీకి రేవంత్‌ రెడ్డి రాజీనామా అనంతరం ఆ పార్టీ నుంచి నేత‌లు, కార్య‌క‌ర్త‌లు భారీగా వ‌ల‌స‌ వెళుతున్నారు. తాజాగా జ‌య‌శంక‌ర్ భూపాలప‌ల్లి జిల్లా టీడీపీ అధ్య‌క్ష ప‌ద‌వికి గండ్ర స‌త్య‌నారాయ‌ణ కూడా మంగళవారం రాజీనామా చేశారు.

One more shock to TTDP.. Gandra Satyanarayana Resignation, He may be joining in TRS Tomorrow

త‌న రాజీనామా లేఖ‌ను ఆయన పార్టీ అధ్యక్షుడు చంద్ర‌బాబు నాయుడుకి పంపించారు.
అంతేకాదు, బుధవారం నాడు గండ్ర స‌త్య‌నారాయ‌ణ తెలంగాణ‌ సీఎం కేసీఆర్ స‌మక్షంలో టీఆర్ఎస్‌లో చేర‌నున్నారు.

మరోవైపు కాంగ్రెస్ నుంచి కూడా ఓ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ టీఆర్ఎస్ లో చేరికకు రంగమంతా సిద్ధమైందనే ప్రచారం జరుగుతోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
One more shock to TTDP.. After Revanth Reddy's resignation to the party one by one key personalities, leaders are going out. Now Jayashankar Bhupalpally District TDP District President Gandra Satyanarayana has submitted his resignation on Wednesday. He sent his resignation letter to his party chief Chandrababu Naidu. According to the sources, Gandra Satyanarayana is going to join in TRS on Thursday in the presence of CM KCR.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి