Onion Price: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధర..!
రాష్ట్రంలో ఉల్లి ధరలు మళ్లీ పెరుగుతోన్నాయి. దీంతో సామాన్యులు ఉల్లిని కోయకుండానే కన్నీరు పెడుతున్నారు. దసరా, దీపావళి సమయంలో కిలో ఉల్లి ధర రూ.30 ఉంది. నెల క్రితం కూడా కిలో ఉల్లి రూ.70 నుంచి రూ.80కి పెరిగింది. కేంద్ర ప్రభుత్వం చర్యలు, రైతులు నిల్వ ఉంచిన ఉల్లిని మార్కెట్ కు తీసుకురావడంతో ఉల్లి ధర కాస్త తగ్గుముఖం పట్టింది. కిలో రూ. 40 నుంచి రూ.50 తగ్గింది.
ఇప్పుడు ఉల్లి ధరలు మళ్లీ పెరుగుతోన్నాయి. ప్రస్తుతం కిలో ఉల్లి రూ. 80 పలుకుతోంది. గతంలో టమాట ధరతో హడలిపోయిన ప్రజలు ప్రస్తుతం ఉల్లి ధరలతో బెంబేలెత్తుతున్నారు. సోమవారం మెదక్ మార్కెట్లో పది కిలోల బస్తా తీసుకుంటే రూ.800 అంటే కిలోకు రూ.80 చొప్పున... విడిగా కొంటే రూ. 90 కిలో చొప్పున అమ్ముతున్నారు. ఉల్లి ధరలు భారీగా పెరడంతో మిర్చి బండి వద్ద ఉల్లి వేయడం లేదు.

అలాగే చాట్ బండ్ల వద్ద, హోటళ్లలో ఉల్లి వినియోగం తగ్గించారు. బిర్యానీకి ఆనియన్ సాలడ్ ఇవ్వడం లేదు. హైదరాబాద్ లోని మలక్ పేట ఉల్లి మార్కెట్ ఉల్లి రాక తగ్గడంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఉల్లి ధరలు పెరగడంతో చాలా మంది ఇండ్లలో ఉల్లిగడ్డల వినియోగాన్ని తగ్గిస్తున్నారు. రెండు, మూడు నెలల తర్వాత ఉల్లి ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అటు దేశంలో కూడా ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. కేంద్ర బఫర్ స్టాక్ ను విడుదల చేసినా ధరలు అదుపులోకి రావడం లేదు. దీంతో కేంద్రం రూ.25 కిలో ఉల్లిని విక్రయిస్తోంది.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications