ఆన్‌లైన్ వ్యభిచారం: గుట్టు రట్టు.. క్యాబ్‌లో వెళ్తుంటే పట్టుకున్నారు..
ఆదివారం రాత్రి ఓ క్యాబ్‌లో మరో యువతితో కలిసి వెళ్తున్న నాగమణిని అదుపులోకి తీసుకుని విచారించారు.
హైదరాబాద్: రాజధానిలో మరో ఆన్‌లైన్‌లో వ్యభిచార దందాను పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఆన్‌లైన్ ద్వారా విటులకు గాలం వేస్తూ యువతులను సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ఓ మహిళ ఆధ్వర్యంలోనే ఇదంతా నడుస్తుండటం గమనార్హం.
పోలీసుల కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా బొమ్మరాసిపేటకు చెందిన మల్లెకేడి నాగమణి(30) కొన్నాళ్లు నగరంలో వంట మనిషిగా పనిచేసింది. తర్వాత నగరంలోని సరూర్‌నగర్‌కు మకాం మార్చి ఆన్‌లైన్ వ్యభిచారంలోకి దిగింది. పలువురు అమాయక యువతులను మోసగించి వ్యభిచారంలోకి దించుతోంది.

ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న విటుల వద్దకు యువతులను సరఫరా చేస్తోంది. ఆదివారం ఈ వ్యవహారంపై ఎస్‌వోటీ, సరూర్‌నగర్ పోలీసులకు సమాచారం అందడంతో.. ఆమెపై నిఘా పెట్టారు. ఆదివారం రాత్రి ఓ క్యాబ్‌లో మరో యువతితో కలిసి వెళ్తున్న నాగమణిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో నాగమణి నేరాన్ని అంగీకరించింది. బాధిత యువతిని రక్షించిన పోలీసులు.. నిందితురాలి వద్ద రూ.2,440 నగదు, 2 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications