విదేశీ కాల్ గాళ్స్‌తో ఆన్‌లైన్ సెక్స్ రాకెట్: భాగ్యనగరంలో మరో ముఠా గుట్టు రట్టు..

విదేశాల నుంచి అమ్మాయిలను రప్పించి గుట్టుగా వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు బయటపెట్టారు.

హైదరాబాద్: అటు డ్రగ్స్ రాకెట్.. ఇటు సెక్స్ రాకెట్ లతో విదేశీ ముఠాలు భాగ్యనగరంపై పంజా విసురుతున్నాయి. విదేశాల నుంచి అమ్మాయిలను రప్పించి గుట్టుగా వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు బయటపెట్టారు.

అశ్లీల వైబ్‌సైట్లను కేంద్రంగా చేసుకుని ఈ ముఠా విటులను ఆకర్షిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోర్న్ సైట్ల నియంత్రణపై నిఘా పెట్టిన క్రమంలో ఈ వ్యవహారం బట్టబయలైంది.

 టాంజానియా గాళ్స్:

టాంజానియా గాళ్స్:

లోకాంటో.కామ్ అనే అశ్లీల వెబ్ సైట్లలో అమ్మాయిల అర్థనగ్న ఫోటోలు అప్‌లోడ్ చేసి విటులను ఆకర్షిస్తున్నారు. ఫోటోల కిందే ధరను పెట్టి ఫోన్ నంబర్లు ఇస్తున్నారు. అలా ఆన్‌లైన్‌లో తమను సంప్రదించినవారి కోసం టాంజానియా నుంచి అమ్మాయిలను రప్పిస్తున్నారు.

 విదేశీ యువతుల్ని రప్పించి:

విదేశీ యువతుల్ని రప్పించి:

విజిటింగ్ వీసాలపై హైదరాబాద్‌లో దిగుతున్న విదేశీ యువతులు.. మూడునెలల పాటు ఇక్కడ వ్యభిచార వృత్తిలో బాగా సంపాదిస్తున్నారు. ఆపై విదేశాలకు చెక్కేస్తున్నారు.పోర్న్ వైబ్‌సైట్ల ద్వారా విటులను ఎరవేస్తున్న ఓ గ్యాంగ్ గుట్టును తాజాగా రాచకొండ పోలీసులు రట్టు చేశారు.

 ఇలా పట్టుకున్నారు:

ఇలా పట్టుకున్నారు:

ఆన్‌లైన్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేయడానికి రాచకొండ, కుషాయిగూడ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. సదరు వెబ్‌సైట్ లో పేర్కొన్న ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి వారిని సంప్రదించారు. ఫోన్ లో వారు తెలిపిన వివరాల ఆధారంగా ఓ అడ్రస్‌కు వెళ్లారు. అప్పటికే ఇద్దరు టాంజానియా యువతులతో పాటు మరో వ్యక్తి ఉండటాన్ని గమనించారు. వారిని అదపులోకి తీసుకున్నారు.

పట్టుబడింది వీళ్లే:

పట్టుబడింది వీళ్లే:

పట్టుబడిన యువతులు టాంజానియా దారుస్సలానికి చెందిన హ్యాపీనెస్‌ క్షుక, లిలియన్‌ రేమండ్‌గా పోలీసులు గుర్తించారు. వారితోపాటు పారనాయిడ్‌ అలెక్స్‌ కియాండో విజిట్‌ వీసాపై మూడు నెలల కిందట హైదరాబాద్ కు వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.వీరు ముగ్గురు కుషాయిగూడ ఠాణా పరిధిలోని కందిగూడ హస్తినాపురంలో ఓ పెంట్‌హౌస్‌ను అద్దెకు తీసుకున్నారు.

 అశ్లీల సైట్‌లో చిత్రాలు:

అశ్లీల సైట్‌లో చిత్రాలు:

తమ అర్దనగ్న చిత్రాలను యువతులు అశ్లీల వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. ఫోన్ నంబర్స్ ద్వారా సంప్రదించే ఒక్కో విటుడి నుంచి రూ.20వేల వరకు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక్కడ ఆన్ లైన్ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న యువతులు.. మరికొంతమంది మహిళలను ఈ ఊబిలోకి దింపాలని ప్రయత్నిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

వీరివద్ద నుంచి 4 మొబైల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ముగ్గురికి ఇతర విదేశీయులతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. వ్యభిచారమేనా.. డ్రగ్స్ కూడా సరఫరా చేస్తున్నారా? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+