సమ్మర్ లో 'ఊటీ' టూర్.. బడ్జెట్ ధరకే ఫుల్ ఎంజాయ్ మస్తీ మజా..

ఎండలు మండిపోతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోంది. అలాగే వేసవి సెలవులు కూడా ఇచ్చేశారు. అయితే ఈ సమ్మర్ లో ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటున్నారా..? వేసవి నుంచి తప్పించుకోవడానికి కూల్ గా ఉండే ప్రాంతాల్లో విహరించాలని ఉందా..? అయితే ఊటీ వెళ్లండి. వేసవిలో బడ్జెట్ ధరకే ఊటీలో ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మరి ఊటీకి ఎలా వెళ్లాలి..? తెలుగు రాష్ట్రాల నుంచి ఊటీకి ఎలా చేరుకోవాలి..? ఇక్కడ చూద్దాం..

ఓవైపు ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో పచ్చని ప్రకృతి మధ్య సేద తీరాలని అనుకుంటున్నారా..? మీ ఫ్యామిలీతో హాయిగా సమయాన్ని గడపాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం తక్కువ ధరకే ఊటీ టూర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఐఆర్సీటీసీ. ఈ అద్భుతమైన ప్యాకేజీలో భాగంగా ఊటీలో ఎంచక్కా ఎంజాయ్ చేసే వీలుంది. ఈ టూర్ మొత్తం ఈ టూర్​ 5 రాత్రులు, 6 పగళ్లు సాగుతుంది. ఈ టూర్ కు వెళ్లాలనుకునే పర్యటకులు సికింద్రాబాద్, నల్గొండ, గుంటూరు, తెనాలి రైల్వేస్టేషన్లలో ట్రైన్ ఎక్కే ఛాన్స్ ఉంది. అలాగే రిటర్న్ జర్నీలో ఆయా స్టేషన్లలో ట్రైన్ దిగొచ్చు.

సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషాలకు ట్రైన్ స్టార్ట్ అవుతుంది. రాత్రి మొత్తం జర్నీ సాగుతుంది. ఇక రెండోరోజు ఉదయం 9 గంటలకు కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడినుంచి ఊటీకి చేరుకుంటారు. అక్కడే ఊటీ లేక్, బొటానికల్ గార్డెన్స్ ను వీక్షిస్తారు. ఇక మరుసటిరోజు పైకారా వాటర్ ఫాల్స్ లో చిల్ అవుతారు.

Ooty Calling This Summer Fun Excitement amp amp Joy at Surprisingly Budget-Friendly Prices Ooty tour

నాలుగోరోజు ఉదయం కూనూర్ లో అందాలను సందర్శిస్తారు. రాత్రి ఊటీలోనే బస ఉంటుంది. మరుసటిరోజు కోయంబత్తూర్ స్టేషన్ నుంచి సాయంత్రం 3గంటల 40 నిమిషాలకు ట్రైన్ స్టార్ట్ అవుతుంది. మరుసటి రోజు ఉదయానికి సికింద్రాబాద్ చేరుకుంటారు. దాంతో టూర్ ముగుస్తుంది. ఇక ఈ స్పెషల్ టూర్ ప్రస్తుతం మే 5, 12, 19, 26 అలాగే జూన్​ 2, 9, 16, 23 తేదీల్లో అందుబాటులో ఉంది. పూర్తి వివరాల కోసం ఐఆర్సీటీసీ అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+