పేదల కార్పోరేట్ ఆస్పత్రి "నిమ్స్" - కొత్తగా మరిన్ని సేవలతో..!!
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న నిమ్స్ ప్రాధాన్యత పెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంజీవనిగా మారుతోంది. అత్యాధునిక వైద్య సదుపాయాలతో పేదలకు అనుకూలంగా కార్పోరేట్ ఆస్పత్రి సేవలు అందిస్తోంది. తక్కువ ఫీజు..ఆరోగ్య శ్రీ సౌకర్యంతో పాటుగా అనుభవం ఉన్న వైద్యుల ఆధునిక సేవలతో ఇక్కడకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. సుమారు 70 ఏండ్ల చరిత్ర ఉన్న నిమ్స్‌ను వసతులు, సేవల పరంగా చూసినప్పుడు 2014కు ముందు.. 2014 తర్వాత అనే విధంగా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.
పేదల ఆస్పత్రిగా:హైదరాబాద్ నగరంలో పలు ప్రఖ్యాత కార్పోరేట్ ఆస్పత్రులు ఉన్నాయి. ఆర్దికంగా ఇబ్బందులు లేని వారికి ఆ ఆస్పత్రుల్లో సేవలు పొందుతున్నారు. పేద ప్రజలకు మాత్రం నిమ్స్ కనిపిస్తోంది. ఏ మాత్రం కార్పోరేట్ సేవలకు తీసిపోకుండా ఇక్కడ వైద్య సేవలు కొనసాగుతున్నాయి.

ఇప్పటికీ పాతతరం వాళ్లు బొక్కల దవాఖాన అంటే టక్కున గుర్తుపడతారు. 2009లో తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ నిరహార దీక్ష చేసారు. ఆ సమయంలో నిమ్స్ లోనే కేసీఆర్ కు వైద్యం అందించారు. నిమ్స్ కు అన్ని రకాల హంగులు ఉన్నా..2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో వసతులు మాత్రం వస్తున్న రద్దీకి అనుగుణంగా లేవు. దీంతో కేసీఆర్ సీఎం అయిన తరువాత ఏటా రూ.100 కోట్లు కేటాయించి నిమ్స్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇచ్చిన మాట మేరకు క్రమం తప్పకుండా నిమ్స్‌కు నిధులు కేటాయిస్తూనే ఉన్నారు.
నిమ్స్ మరింత విస్తరణ:ఇప్పుడు నిమ్స్ విస్తరణకు నడుం బిగించారు. 2000 పడకలతో నిర్మించబోతున్న దశాబ్ది భవనాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసారు. దీంతో దేశంలో అత్యధిక సూపర్ స్పెషాలిటీ పడకలు ఉన్న దవాఖానగా నిమ్స్ ముందు వరుసలో నిలువన్నది. 2014 నాటికి దవాఖానలో 900 పడకలు మాత్రమే ఉండేవి.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ సంఖ్యను 1489కి పెంచారు. అంటే స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్లలోనే పడకల సంఖ్య 65% పెరిగింది. 2014 నాటికి 111 మంది బోధనా సిబ్బంది ఉండగా నిరుడు చివరినాటికి ఈ సంఖ్య 264కు పెరిగింది. రెసిడెంట్ డాక్టర్లు గతంలో ఏటా 82 మందిని కేటాయించగా, ప్రస్తుతం 169 మందిని కేటాయిస్తున్నారు. నిమ్స్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా సేవలు అందిస్తున్నది. తొమ్మిదేండ్లలో లక్షన్నర మంది లబ్ధిపొం దారు. రూ.533 కోట్ల విలువైన ఆరోగ్యశ్రీ సేవలు పేదలకు అందాయి.
అవయయ మార్పిడిలో:అవయవ మార్పిడులు ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా చేస్తున్నారు. 2014లో 26 కోట్ల విలువైన సేవలు అందగా.. 2022-23 నాటికి 97 కోట్ల విలువైన సేవలు అందించింది. 2014 నుంచి 2021 వరకు మొత్తం రూ.90 కోట్ల విలువైన పరికరాలను దవాఖాన కోసం కొనుగోలు చేశారు.

2022లో మరో రూ.153 కోట్ల పరికరాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చారు. నిమ్స్‌లో కొత్తగా ఎమర్జెన్సీ మెడిసిన్, క్లినికల్ హెమటాలజీ, పీడియాట్రిక్ నెఫ్రాలజీ, పీడియాట్రిక్ ఆంకాలజీ, జీరియాట్రిక్ మెడిసిన్, స్టెమ్ సెల్ రీసెర్చ్ ఫెసిలిటీని (మూలకణ పరిశోధనల విభాగం) ఏర్పాటు చేసింది. గతం లో ఏటా కేవలం 11 వేల సర్జరీలు జరిగితే ఇప్పు డు ఏకంగా 25 వేల వరకు అవుతున్నాయి. మొత్తం 33 ఎకరాల్లో నిమ్స్ విస్తరణ పనులు చేపట్టనున్నారు. మొత్తం మూడు బ్లాకులు నిర్మించనున్నారు. ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ సేవలకు ప్రత్యేకంగా బ్లాక్‌లు ఏర్పాటుకానున్నాయి.
భవిష్యత్ అవసరాల కోసం:భవిష్యత్తులో పెరుగనున్న రద్దీ, విస్తృతం కానున్న స్పెషాలిటీ సేవలను దృష్టిలో పెట్టుకొని ఏకంగా 8 అంతస్థుల్లో ఓపీ బ్లాక్‌ను నిర్మించనున్నారు. ఎమర్జెన్సీ సేవల కోసం ప్రత్యేకంగా 8 అంతస్థులతో బ్లాక్‌ను నిర్మిస్తున్నారు. ఇన్‌పేషంట్ల కోసం 13 అంతస్థులతో మరో బ్లాక్ ఏర్పాటు చేయనున్నారు.
కొత్త భవనంలో మొత్తం 30 ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి. 2 వేల పడకలు అందుబాటులోకి వస్తుండగా అన్నింటికీ ఆక్సిజన్ సరఫరా ఉంటుంది. ఇందులో 1,200 ఆక్సిజన్ బెడ్లు, 500 ఐసీయూ బెడ్లు ఉంటాయి. ప్రత్యేక గది కావాలనుకునే రోగుల కోసం కొత్తగా పేయింగ్ రూమ్స్ సేవలను అందుబాటులోకి తేనున్నారు. 300 గదులు ఇందుకోసం కేటాయిస్తారు. కిడ్నీ, లివర్, గుండె వంటి అవయవాలు, ఎముక మజ్జ, కీళ్ల మార్పిడి, గూనిని సరిచేసే స్పైన్ డీఫార్మిటీ కరెక్షన్స్ ఆపరేషన్లలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇవన్నీ ఆరోగ్య శ్రీ కింద ప్రభుత్వం ఉచితంగా చేస్తున్నారు.సర్జరీతో ఆపకుండా వారికి జీవితాంతం అవసరమయ్యే మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications