"టీ" వాలెట్ - దేశంలో తొలిసారిగా : జీ-20 ఆర్థిక సదస్సులో ప్రత్యేకంగా..!!
జీ-20 ఆర్థిక సదస్సులో "టీ" వాలెట్ నిర్వహణ పైన చర్చ ఆసక్తికరంగా సాగింది.
ఆవిష్కరణల్లో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది. డిజిటల్ వాలెట్ ను రూపొందించిన మొదటి రాష్ట్రం తెలంగాణ. దేశంలోనే తొలి సారిగా ప్రభుత్వం రూపొందించిన వాలెట్ ఇప్పుడు జీ 20 సదస్సులో అందరి ప్రశంసలు అందుకుంది. దీని ద్వారా పల్లెలకు ఆన్ లైన్ సేవలు చేరువయ్యాయి. లబ్దిదారులకు చెల్లించే పథకాల సొమ్మును ఇదే వాలెట్ ద్వారా అందిస్తున్నారు. ప్రజలు సాధారణంగా వినియోగించే పలు రకాల చెల్లింపులకు ఈ వాలెట్ ఉపయోగపడుతోంది.1,169 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. 2017లో ప్రారంభించిన ఈ వాలెట్ 1.39 మిలియన్ సబ్‌స్క్రైబర్లు..35 మిలియన్ లావాదేవీలు నమోదు చేసింది.

దేశంలో తొలిసారిగా తెలంగాణలో
తెలంగాణ ప్రభుత్వం మరో అరుదైన గుర్తింపు దక్కించుకుంది. దేశంలోనే తొలి సారిగా ప్రభుత్వం వాలెట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. టీ వాలెట్ పేరుతో అందుబాటులోకి ఈ డిజిట్ పేమెంట్ నెట్ వర్క్ కు ఆదరణ పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైనా ఎక్కడైనా డిజిటల్ చెల్లింపులు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా వినియోగంలోకి తీసుకొచ్చిన వాలెట్. 2017లో దీనిని ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ ప్రారంభించిన టీ వాలెట్ తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ పెద్ద సంఖ్యలో వినియోగిస్తున్నారు. అనేక యూపీఐ చెల్లింపుల యాప్ లు అందుబాటులో ఉన్నా.. ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్న యాప్ కావటంతో దీనికి ఆదరణ పెరుగుతోంది. అనేక సంస్థల సేవలతో పాటుగా చెల్లింపులకు వీలుగా దీనిని రూపొందించారు. ఇంగ్లీషుతో పాటుగా తెలుగు, ఉర్ధూ భాషల్లో ఇందులో సేవలు అందుబాటులో ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు తరువాత డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ప్రారంభించిన టీ వాలెట్ ఇప్పుడు ప్రభుత్వ - పథకాల చెల్లింపుల్లో కీలకంగా మారింది. రేషన్ దుకాణాల్లోనూ టీ వాలెట్ సేవలను వినియోగిస్తున్నారు.

1.39 మిలియన్ సబ్‌స్క్రైబర్లు..35 మిలియన్ లావాదేవీలు
టీ వాలెట్ ద్వారా పల్లెలకూ ఆన్ లైన్ సేవలు చేరువయ్యాయి. టీ వాలెట్ ద్వారానే ప్రభుత్వ పథకాల సొమ్ము లబ్దిదారులకు చేరుతోంది. ప్రధానంగా స్త్రీనిధి రుణాలు..ఆసరా పెన్షన్ల చెల్లింపులు ఈ వాలెట్ ద్వారానే కొనసాగుతున్నాయి. అదే విధంగా పబ్లిక్ యుటిలిటీ సర్వీసులను ఇదే వాలెట్ ద్వారా చెల్లింపులకు అవకాశం కల్పించారు. వినియోగంలో సెక్యూరిటీ పరంగానూ జాగ్రత్తలు తీసుకున్నారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ లేదా కార్డును స్వైప్ చేయడం ద్వారా చెల్లింపులు చేసే విధంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. టీ వాలెట్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు స్కాలర్‌షిప్ బదిలీ కొనసాగుతోంది. విద్యార్థులు బ్యాంక్ ఖాతా ద్వారా కాకుండా నేరుగా వాలెట్‌ని ఉపయోగించి తెలంగాణలోని వివిధ మీసేవా కేంద్రాల నుండి డబ్బు డ్రా చేసుకునేందుకు వీలుగా నగదు విత్‌డ్రాలను సులభతరం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. టీ వాలెట్ లో ఇప్పటి వరకు 1.39 మిలియన్ సబ్‌స్ర్కైబర్‌లు..35 మిలియన్ లావాదేవీలు జరిగినట్లు ప్రభుత్వం అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

జీ-20 దేశాల ఆర్థిక సదస్సులో ప్రత్యేక గుర్తింపు
హైదరాబాద్ వేదికగా జీ-20 దేశాల ఆర్థిక సదస్సులో టీ వాలెట్ ద్వారా ప్రజలకు బ్యాంకింగ్ సేవలను చేరువ చేసిన విధానంపై చర్చ జరిగింది. టీ వాలెట్ ఓ అద్భుతమని రాష్ట్ర ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ సదస్సులో వివరించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని దేశంలోనే తొలిసారిగా టీ వాలెట్‌ను తీసుకొచ్చామని గుర్తు చేశారు. తెలంగాణలోని మారుమూల పల్లెల్లోనూ టీ వాలెట్ అందుబాటులో ఉన్నదని చెప్పారు. తెలిపారు. టీ వాలెట్ నుంచి ఏదైనా బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేసుకోవచ్చని, ఎటువంటి సర్వీస్ చార్జీ లేకుండానే సేవలు అందిస్తున్నామని వివరించారు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్‌సేథ్‌తోపాటు 40 దేశాల ప్రతినిధుల సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ పేమెంట్ వాలెట్ పైన ఆసక్తికర చర్చ జరిగింది. టీ వాలెట్ నుంచి ఏదైనా బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేసుకోవచ్చని, ఎటువంటి సర్వీస్ చార్జీ లేకుండానే సేవలు అందిస్తున్నామని జయేశ్‌రంజన్ వివరించారు. డిజిటల్ రంగంలో తెలంగాణ టీ వాలెట్ ఒక కేస్ స్టడీలా ఉపయోగపడుతుందని సదస్సులో నిపుణులు అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications