విద్యుత్ విప్లవానికి చిరునామాగా - వెలుగుల తెలంగాణ..!!

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్‌రంగానికి పెద్దపీట వేసింది. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు తెలంగాణలో విద్యుత్‌ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండేది. తెలంగాణ ప్రభుత్వం 24 గంటల నిరంతర, ఉచిత కరెంటు సరఫరా అందిస్తోంది. ట్రాన్స్‌మిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌ను బలోపేతం చేయడానికి రూ.38 వేల కోట్లు ఖర్చు చేసి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసారు. ఫలితంగా విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.

తెలంగాణ ఆవిర్భావానికి ముందు తెలంగాణలో విద్యుత్‌ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండేది. కానీ, రాష్ట్ర ఆవిర్భావం తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి ప్రాధాన్యత విద్యుత్ రంగం బలోపేతానికి ఇచ్చారు. గతంలో కరెంటు ఉంటే వార్త. ఇప్పుడు కరెంటు పోతే వార్త అన్నట్లుగా పరిస్థితుల్లో అనూహ్య మార్పులు వచ్చాయి. నేడు వ్యవసాయానికి ఇస్తున్న 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ అందుతోంది. తొమ్మిదేళ్ల కాలంలోనే తెలంగాణ విద్యుత్ రంగం ఊహించని పురోగతి సాధించింది. నిరంతర కరెంటుతో తమ పరిశ్రమల్లో ఉత్పత్తి పెరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే భూపాలపల్లిలో 600 మెగావాట్లు, కొత్తగూడెంలో 800 మెగావాట్లు, మణుగూరులో 1080 మెగావాట్ల సామర్థ్యం గల ఐదు థర్మల్‌ పవర్‌ స్టేషన్లను నిర్మించి ఉత్పత్తిని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.

Opinion Telangana government has achieved revolutionary achievements in 9years time

విద్యుత్ రంగాన్ని బలోపేతం చేస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కేసీఆర్‌ బలంగా విశ్వసించారు. విద్యుత్ ఉత్పత్తిని పెంచేలా నిర్ణయాలు..ఆర్దిక చేయూతతో ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లారు. ట్రాన్స్‌మిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌ను బలోపేతం చేయడానికి రూ.38 వేల కోట్లు ఖర్చు చేసి మౌలిక సదుపాయాలు ఏర్పాటు కల్పించారు. పరిశ్రమల ఏర్పాటులో విద్యుత్ కీలక అంశం. సమస్యే లేని విద్యుత్ సరఫరా ద్వారా పరిశ్రమ ల ఏర్పాటు సుగమం అయింది. నిరంతర విద్యుత్‌ సరఫరాతో రాష్ట్రంలో కోటిన్నర ఎకరాలు సాగులోకి వచ్చి పచ్చని పంటలు దర్శనమిస్తున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో విద్యుత్‌రంగం పాత్ర ఎనలేనిది. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో తెలంగాణలో విద్యుత్‌ ఉత్పత్తి కేవలం 7,770 మెగావాట్లు. ప్రస్తుతం జరుగుతున్న విద్యుత్‌ ఉత్పత్తి 18,000 మెగావాట్లు.

రాష్ట్ర ఆవిర్భవానికి ముందు తెలంగాణలో విద్యుత్‌ డిమాండ్‌ సుమారుగా 6000 మెగావాట్లు ఉంటే, నేడు విద్యుత్‌ డిమాండ్‌ 15,750 మెగావాట్లకు చేరింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విద్యుత్‌రంగంలో 12,000 కొత్త ఉద్యోగుల నియామకం, ఔట్‌ సోర్సింగ్‌లో పనిచేస్తున్న 22,600 మందిని ఆర్టిజన్లుగా మార్చడం, విద్యుత్‌ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తున్నారు. 2014కు ముందు ఇచ్చిన సబ్సిడీలు ఏడాదికి కేవలం రూ.4,500 కోట్లు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇస్తున్న విద్యుత్‌ సబ్సిడీలు రూ.12,000 కోట్ల పైమాటే. తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెలా రూ.1000 కోట్ల సబ్సిడీలను విద్యుత్‌ డిస్కంలకు చెల్లిస్తోంది. ఎక్కడ కరెంట్‌ పోయినా హైదరాబాద్‌లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా చేసింది.

హైదరాబాద్‌ చుట్టూరా 400 కేవీ, 220 కేవీ, 132 కేవీ సబ్‌ స్టేషన్లను నిర్మించి మొత్తం విద్యుత్‌ సరఫరా వ్యవస్థను ఒకదానికొకటి అనుసంధానం చేసింది. ఎంత వర్షం వచ్చినా, గాలి దుమారం వచ్చినా విద్యుత్‌ అంతరాయం లేకుండా సరఫరా జరుగుతున్నది. విద్యుత్‌ వినియోగం నాడు 40 వేల మిలియన్ యూనిట్లు ఉండే అది నేడు 90 వేల యూనిట్లకు చేరుకోకుంది. విద్యుత్‌ సంస్థల్లో జవాబుదారీతనం పెరిగింది. ఎనర్జీ ఆడిటింగ్‌ జరుగుతోంది. ఇలా వరుస నిర్ణయాలు.. ఆచరణ ద్వారా ద్వారా విద్యుత్‌ రంగంలో తెలంగాణ ఘననీయమైన ప్రగతిని సాధించి విద్యుత్ సంస్కరణల్లో అగ్రగామిగా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+