"రియల్" ఫ్యూచర్, అంచనాలకు మించి - కలల సౌధంగా మహానగరం..!!

హైదరాబాద్ అంచనాలకు మించి దూసుకుపోతోంది. భాగ్యనగర భూములకు అంతర్జాతీయ డిమాండ్‌ పెరుగుతోంది. భూములకు కండ్లుచెదిరే ధర పలుకుతోంది. అనతికాలంలోనే దేశంలోనే ముంబై తర్వాత ఎక్కువ ఆకాశహర్మ్యాలతోపాటు ఎత్తయిన భవనాలు ఉన్న నగరంగా హైదరాబాద్‌ ప్రసిద్ధికెక్కినట్టు ఇటీవల ఒక సర్వేలో వెల్లడైంది. రియల్ ఫ్యూచర్ కు కలకల సౌధంగా హైదరాబాద్ నిలుస్తోంది. కిలోమీటర్ల కొద్దీ విస్తరణ జరుగుతోంది.

అనూహ్య ప్రగతి:హైదరాబాద్ నగరంలో గత తొమ్మిదేళ్ల కాలంలో అనూహ్య ప్రగతి కనిపిస్తోంది. అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోంది. ఇతర నగరాలకు భిన్నంగా అభివృద్ధి కొనసాగుతోంది. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌ తొమ్మిదేండ్లలో వివిధ రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని తాజా సర్వేలో స్పష్టం అయింది. ఒక్కో భవనం 48 నుంచి 59 అంతస్థుల వరకు ఉన్నాయి. గత 3-4 ఏండ్లుగా ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్ట్‌, నానక్‌రాంగూడ, పుప్పాలగూడతోపాటు కోకాపేటలో భారీ ఎత్తయిన భవనాలు నిర్మితమవుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో ఎకరాల మేర భూమి లభ్యత అనేది చాలా ఖరీదుగా మారింది. కోకాపేటలో ప్రభుత్వ భూముల వేలంలో ఎకరా రూ.100 కోట్లు ధర పలకటం దేశ వ్యాప్తంగా చర్చకు కారణమైంది.

Opinion:The Hyderabad Renaissance: unraveling KCRs role in the Citys progress

అంతర్జాతీయ డిమాండ్‌ :మౌలిక వసతులతో అంచనాలకు మించి పట్టణీకరణతో భాగ్యనగర భూములకు అంతర్జాతీయ డిమాండ్‌ ఏర్పడింది. హైదరాబాద్ కు ఉన్న భౌగోలిక అంశాలతో పాటుగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఈ అభివృద్ధి వెనుక కారణాలుగా చెబుతున్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా టీఎస్‌ ఐపాస్‌ ద్వారా సింగిల్‌ విండో విధానంలో అనుమతులను ఇస్తున్నది. ఒకవైపు పుష్కలమైన ల్యాండ్‌ బ్యాంక్‌..

మరోవైపు ఫ్రెండ్లీ గవర్నమెంట్‌ ఉండటంతో పెట్టుబడిదారులు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారు. తద్వారా రియల్‌ రంగానికి విపరీతమైన జోష్‌ వచ్చింది. దీనికితోడు కంపెనీల రాకతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలూ పుష్కలంగా ఉన్నందున నివాసాలపరంగానూ రియల్‌ రంగంలో లావాదేవీలు భారీ ఎత్తున పెరుగుతున్నాయి.

Opinion:The Hyderabad Renaissance: unraveling KCRs role in the Citys progress

మెట్రోలను దాటి ముందుకు:రియల్‌ పెట్టుబడులతోపాటు ఆఫీస్‌ స్పేస్‌లోనూ మహానగరం ఇతర మెట్రోలను దాటి దూసుకుపోతున్నది. హైదరాబాద్‌ 2.0 పేరుతో వెల్లడించిన నివేదికలో 2016 నుంచి 2022 వరకు ఐటీ, ఐటీఈఎస్‌తో పాటు ఫార్మా, బయోటెక్నాలజీ, లాజిస్టిక్‌... ఇలా వివిధ రంగాల్లో అభివృద్ధి చెందిన విధానంపై రూపొందించిన నివేదికలో హైదరాబాద్‌ ఆఫీస్‌ స్పేస్‌ మార్కెట్‌ ఆల్‌ టైం హైగా రికార్డు నమోదైంది.

సుమారు 11.5 మిలియన్‌ చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ వినియోగంలోకి వచ్చింది. రియల్‌ రంగంలో విదేశీ సంస్థాగత పెట్టుబడుల్లో హైదరాబాద్‌ టాప్‌గా నిలిచింది. హైదరాబాద్‌లో ఈ పెట్టుబడుల విలువ ఏకంగా 687 మిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఇలా ప్రతీ ఏటా సర్వేల్లో హైదరాబాద్ అగ్రభాగంలో నిలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+