ఆ జిల్లాలపై కక్ష కట్టారు: కెసిఆర్‌పై పోరుకు ఏకమైన విపక్షాలు
హైదరాబాద్: ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పునకు వ్యతిరేకంగా తెలంగాణలోని ప్రతిపక్షాలు ఒక్కటయ్యాయి. ప్రాజెక్టు డిజైన్ మార్పుపై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ ప్రతిపక్షాల నాయకులు శనివారం గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు.
కాంగ్రెసు, తెలుగుదేశం, బిజెపి, వైయస్సార్ కాంగ్రెసు, సిపిఐ నేతలు గవర్నర్‌ను కలిశారు. గవర్నర్‌తో భేటీ తర్వాత వారు మీడియాతో మాట్లాడారు. ప్రాణహిత - చేవెళ్ల మార్పు వల్ల హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలకు జరిగే నష్టాన్ని గవర్నర్‌కు వివరించినట్లు వారు తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కక్ష కట్టారని వారు వ్యాఖ్యానించారు.

ఆ ప్రాజెక్టుకు వైయస్ రాజశేఖర రెడ్డి అప్పట్లో వేయి కోట్ల రూపాయలు కేటాయించారని, ఇప్పుడు డిజైన్ మారిస్తే ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని వారన్నారు. డిజైన్ మార్పు వల్ల అంతర్ జిల్లా వివాదాలు తలెత్తుతాయని వారు చెప్పారు.
డిజైన్ మార్పునకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు చెప్పారు. అంతకు ముందు గన్‌పార్కులోని అమర వీరుల స్థూపం వద్ద అఖిల పక్ష నేతలు నివాళులు అర్పించారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications