ఢిల్లీలో విపక్షాలు, హైదరాబాద్‌లో మిత్రపక్షాలు... అభివృద్దిని అడ్డుకునేందుకు విమర్శలు... టీఆర్ఎస్
Recommended Video
సచివాలయం భవన నిర్మాణాలను ప్రతిపక్షాలు అడ్డుకునేందుకు గవర్నర్‌కు పిర్యాధు చేయడం అత్యంత దుర్మార్గమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ మండిపడ్డారు. ఆయా పార్టీలు సిద్దాంతాలను పక్కనబెట్టి అభివృద్ది సంక్షేమ పథకాలను అడ్డుకుంటాయని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలను చూసి ప్రతి పక్ష్యాలు భయపడుతున్నాయని అన్నారు. అందుకే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సచివాలయా నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లడంతో ఇటివల రాష్ట్ర గవర్నర్ నర్సింహన్‌ను కలిసి ప్రస్థుతం ఉన్న భవనాలను కూల్చివేయకుండా అడ్డుకోవాలని వినతిపత్రం అందించాయి. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రామాలపై ప్రతిపక్షాలు బెంబేలెత్తున్నారని విమర్శించారు.

ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో విమర్శలు చేసుకునే కాంగ్రెస్ బీజేపీలు రాష్ట్రంలో మాత్రం మిత్రపక్షాలుగా మారాయని ప్రభాకర్ విమర్శించారు. మరోవైపు అసెంబ్లీ ,సెక్రటేరీయట్ నిర్మాలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ప్రభుత్వానికి వచ్చే పేరును అడ్డుకునే కుట్రలో భాగంగా ప్రతిపక్షాలు సిద్దాంతాలను పక్కన బెట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు.నిర్మాత్మక సలహాలను ఇవ్వలేని ప్రతిపక్షాలను దేశంలో ఎవ్వరు పట్టించుకోలేదని, తెలంగాణలో కూడ అదే జరుగనుందని ఆయన తెలిపారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications