'చంద్రబాబుతో గొడవ.. ఆఫీస్‌కు రాని కెసిఆర్', '25 ఏళ్లు పడ్తుంది'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన వివిధ పార్టీల నేతలు మంగళవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టిడిపి, కాంగ్రెస్, వామపక్ష నాయకులు వేర్వేరుగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాలన గాలికొదిలేసిన కెసిఆర్: పొన్నం
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాలనను గాలికి వదిలేశారని కరీంనగర్ జిల్లా మాజీ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సిఎం కేసిఆర్ ఇద్దరు తిట్టుకోవడానికే సరిపోతోందన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ గత 50 రోజులుగా సచివాలయానికి వెళ్లలేదన్నారు. ఇక పాలన ఏం చేస్తారన్నారు. పరిపాలనను గాలికి వదిలేశారన్నారు. సాధ్యం కాని హామీలను ఇచ్చి గద్దెనెక్కారని మండిపడ్డారు. ఆయనకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుందన్నారు.

కెసిఆర్‌కు అధికారంలో ఉండే హక్కు లేదని జీవన్ రెడ్డి మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇంకా ఒక్క ఇళ్లు నిర్మించలేదన్నారు. పెండింగులో ఉన్న ఇందిరమ్మ బిల్లులు చెల్లించలేదని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం కొడుకు, అల్లుడు, కూతురు కోసమేనా అన్నారు.
కెసిఆర్ నియంతృత్వ పాలన సాగిస్తున్నారని సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. కెసిఆర్ అధికారంలోకి రాకముందు ఓ మాట, వచ్చాక మరో మాట చెబుతున్నారన్నారు. చరిత్రలో ఎన్నడు లేనివిధంగా జిహెచ్ఎంసి కార్మికులను తొలగించారని ధ్వజమెత్తారు.
నష్టపరిహారం ఇవ్వాలి
పంటలు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ మంగళవారం అన్నారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆయన పరామర్శించారు.
కెసిఆర్ హామీలు తీర్చాలంటే 25 ఏళ్లు: ఎర్రబెల్లి
కెసిఆర్ తాను ఇచ్చిన హామీలు తీర్చాలంటే 25 ఏళ్లు పడుతుందని తెలంగాణ టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు మండిపడ్డారు. కెసిఆర్ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారన్నారు. తెలంగాణ నగరాలను న్యూయార్క్, సింగపూర్ నగరాల్లా చేస్తామనడం విడ్డూరమన్నారు. కెసిఆర్‌వి ప్రజా వ్యతిరేక విధానాలను టిడిపి నేత అద్దంకి దయాకర్ అన్నారు.












Click it and Unblock the Notifications