మహిళలకు రూ 2500, పెన్షన్ల పెంపుపై బడ్జెట్ లో తేల్చిందేంటి..!!
Telangana Budget 2025: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 2025-26 వార్షిక బడ్జెట్ ను ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. 3,04,965 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించారు. కాగా, ఈ బడ్జెట్ లో భట్టి రెవెన్యూ వ్యయం - రూ.2,26,982 కోట్లుగా పేర్కొన్నారు. మూలధన వ్యయం- రూ.36,504 కోట్లు గా పేర్కొన్నారు. ఈ బడ్జెట్ లో ఆరు గ్యారంటీలకు రూ 16 వేల కోట్ల కు పైగా కేటాయించారు. రైతుల కోసం ప్రత్యేకంగా ప్రస్తావన చేసారు. ఇక, మహిళలకు ప్రతీ నెలా రూ 2500 .. పెన్షన్ రూ 4, 016 పెంపు పైన బడ్జెట్ వైపు లబ్దిదారులు ఆశలు పెట్టుకున్నారు. ఇంతకీ ఈ రెండు అంశాల పై బడ్జెట్ లో ఏం తేల్చారు..
హామీలకు నిధులు
తెలంగాణ బడ్జెట్ 2025-26 లో ఆరు గ్యారంటీల కోసం రూ.56,084 కోట్లు కేటాయింపులు చేసారు. రైతు భరోసా - రూ.18 వేల కోట్లు, చేయూత పింఛన్లు - రూ.14,861 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లు - రూ.12,571 కోట్లు, మహాలక్ష్మి (ఆర్టీసీ బస్సు) రూ.4,305 కోట్లు, గృహజ్యోతి (200 యూనిట్ల ఉచిత విద్యుత్) రూ.2,080 కోట్లు, సన్నాలకు బోనస్ - రూ.1,800 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ - రూ.1,143 కోట్లు, గ్యాస్ సిలిండర్ రాయితీ - రూ.723 కోట్లు ప్రతిపాదన చేసినట్లు భట్టి వివరించారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు - రూ.1,511 కోట్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ - రూ.3,683 కోట్లు, ఉపకారవేతనాలు - రూ.4,452 కోట్లు కేటాయించారు.

కేటాయింపులు ఎక్కడ
కాగా, కాంగ్రెస్ 2023 ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే సాధారణ పెన్షన్ ను రూ. 4,000, దివ్యాంగ పెన్షన్ ను రూ. 6,000 చేస్తామని హామీ ఇచ్చింది. ఈ సారి బడ్జెట్ లో ఈ మేర కేటాయింపులు చేస్తారని లబ్ది దారులు నిరీక్షించారు. అదే విధంగా మహిళలకు ప్రతీ నెలా రూ 2500 చొప్పున వారి ఖాతాల్లో నగదు జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రెండు డిమాండ్ల పైన ప్రతిపక్షాలు పదే పదే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. అయితే, ఈ బడ్జెట్ లోనూ మహిళలు, వృద్ధులకు ఇచ్చిన హామీలను బడ్జెట్‍లో ప్రస్తావించకపోవటం పైన ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. తులం బంగారం హామీ ఏమైందని నిలదీస్తున్నారు. ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ లో ఈ రెండు పథకాల ప్రస్తావన చేయకపోవటంతో.. వచ్చే ఆర్దిక సంవత్సరంలోనూ ఈ పథకాలు అమలు చేస్తారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
సంక్షేమానికి ప్రాధాన్యత
అదే విధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా - రూ.600 కోట్లు, విద్యుత్ రాయితీ - రూ.11,500 కోట్లు, రాజీవ్ యువ వికాసం రూ.6 వేల కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్ లో సంక్షేమ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. షెడ్యూల్ కులాల సంక్షేమం కు 40,234 కోట్లు కేటాయించిన రేవంత్ ప్రభుత్వం.. షెడ్యూల్ తెగలకు 17,169 కోట్లు , వెనుకబడిన తరగతుల శాఖకు 11,405 కోట్లు, చేనేత రంగానికి 371 కోట్లు , మైనారిటీ సంక్షేమం కు 3,591 కోట్లు కేటాయించారు. అదే విధంగా.. పరిశ్రమల శాఖకు 3,527 కోట్లు , ఐటీ శాఖ కు 774 కోట్లు , విద్యుత్ శాఖకు 21,221 కోట్లు కేటాయింపులు చేసారు. వైద్య ఆరోగ్య శాఖకు 12,393 కోట్లు, మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖకు 17,677 కోట్లు, నీటిపారుదల శాఖకు 23,373 కోట్లు కేటాయించారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications