హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసభ్యపదజాలంతో మహిళకు ఈమెయిల్స్: ఓయూ టీచర్ అరెస్ట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తనతో శరీరక సంబంధం పెట్టుకోవాలంటూ అసభ్యకరంగా ఈ-మెయిల్స్‌ పంపిస్తూ విదేశాల్లో ఉంటున్న ఓ వివాహితను వేధింపులకు గురిచేస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకుడిని సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.

సైబర్‌ క్రైం ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర సాంగ్లికి చెందిన ఓ వివాహిత యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో పీహెచ్‌డీ చదువుతున్నారు. కాగా, ఆమె ఈ-మెయిల్‌ ఐడీకి ప్రేమిస్తున్నానని, తనతో శరీరక సంబంధం పెట్టుకోవాలంటూ అసభ్య పదజాలంతో సందేశాలు పంపిస్తున్నాడు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో అధ్యాపకుడిగా పని చేస్తున్న దేవతల మనోహర్ డేవిడ్ మాథ్యూస్.

Osmania University teacher arrested in sex case

ఈ నేపథ్యంలో బాధితురాలు సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఆ-మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడ్ని ఉస్మానియా యూనివర్సిటీలో ఆంగ్ల ఉపాధ్యాయుడు దేవతల మనోహర్‌ డేవిడ్‌ మ్యాథ్యూస్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

2007 ఇఫ్లూలో ఎంఫిల్ చేస్తున్న సమయంలో ఆమెను చూసిన మాథ్యూస్.. ఆ తర్వాత నుంచి సందేశాలు పంపిస్తున్నట్లు గుర్తించారు. అతన్ని కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు పోలీసులు.

English summary
A 34-year-old teacher working at the OU Arts College was arrested by the Cyberabad cyber crime police for allegedly asking a former colleague to have physical relations with him. The suspect, Devatala Manohar David Mathews, is working in the Department of Communicative English and is also a research associate in the Department of English at OU Arts College.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X