సెటైర్లు రాస్తాం, తేలిగ్గా తీసుకోవాలి: స్మితా సబర్వాల్ ఇష్యూపై ఔట్‌లుక్
హైదరాబాద్: తెలంగాణ ఐఎఎస్ అధికారి స్మితా సబర్వాల్ వివాదంపై ఔట్‌లుక్ మ్యాగజైన్ కప్పదాటుగా వ్యవహరించింది. చెప్పీచెప్పనట్లుగా క్షమాపణలు చెబుతూ తన చర్యను సమర్థించుకోవడానికి ప్రయత్నించింది. తాము సర్వసాధారణంగానే తమ పత్రికలో కొన్ని సెటైర్లు రాస్తామని, అయితే అందులో ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం తమకు లేదని వివరించింది. దాన్ని తేలిగ్గా తేసుకోవాలని సూచించింది.
ది బోరింగ్ బాబు అనే కథనంలో తాము ఎవరి పేర్లను కూడా పేర్కొనలేదని, అయినా తమకు తెలంగాణ ప్రభుత్వంలోని ఓ అధికారి లీగల్ నోటీసు పంపించారంటూ కొన్ని వార్తాపత్రికలు, టీవీ న్యూస్ చానెళఅలు, వెబ్‌సైట్లు చెప్పాయని ఔట్‌లుక్ వివరించింది.

మీడియా గందరగోళం ప్రారంభమై 36 గంటలు గడిచినా తమకు మాత్రం ఏ విధమైన నోటీసు రాలేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో కూడా తమ పత్రిక ప్రతినిధిపై వ్యక్తిగత దాడులు జరుగుతున్నాయని, ఆమెపై దాడి చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఔట్‌లుక్ తన కథనంలో తెలిపింది.
ప్రస్తుత సున్నితమైన పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆ కథనం మొత్తాన్ని తాము తొలగించామని చెప్పింది. ఒకవేళ ఏదైనా తప్పు జరిగినట్లయితే అందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. గత 20 ఏళ్లుగా మానవ హక్కులు, మహిళల హక్కులు, మైనారిటీ హక్కులు, వాక్ స్వాతంత్ర్యాలను కాపాడుతూ వచ్చామని, ఈ విషయం తమ పాఠకులందరికీ తెలుసునని ఔట్‌లుక్ వివరణ ఇచ్చుకుంది.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications