ఆగస్టు 15 నాడు మాంసం తింటే ఏమవుతుంది..? : అసదుద్దీన్ ఓవైసీ

హైదరాబాద్ ఎంపీ, AIMIM పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15 నాడు మాంసం తింటే ఏమవుతుందని ప్రశ్నించారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున మాంసం దుకాణాలు మూసి వేయాలని హైదరాబాద్ లోని కొన్ని నగర పాలక సంస్థలు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ఖండించారు. ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15న మాంసం దుకాణాలు మూసివేయడానికి కల కారణం ఏంటో తనకు చెప్పాలని డిమాండ్ చేశారు.

Owaisi Slams Meat Shop Closure on Independence Day Questions Hyderabad Municipal Orders

" తెలంగాణలో చాలా మంది మాంస ప్రియులు ఉన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున మాంసం ఎందుకు తినకూడదు అంటున్నారో నాకు తెలియడం లేదు. ఇలాంటి నిషేధాలు ప్రజల హక్కులను హరిస్తున్నాయి. వారి వారి మతం, సంప్రదాయాలపై ఇవి మచ్చగా మారుతున్నాయి" అని అసదుద్దీన్ ఓవైసీ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున మాంసం దుకాణాలను మూసివేయాలని హైదరాబాద్ తోపాటు దేశవ్యాప్తంగా కొన్ని నగరపాలక సంస్థల నిర్ణయం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, ప్రజల బావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తుందని అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్ లో ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం, ఆగస్టు 16 కృష్ణాష్టమి పండుగ సందర్భంగా జీహెచ్ఎంసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. నగరంలోని మాంసం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు ఇచ్చింది. జీహెచ్ఎంసీ చట్టం, 1955 లోని 533(బీ) అధికరణ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే ఈ నిర్ణయంపై పలు మాంసం దుకాణాల యజమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా ఈ నిర్ణయంపై అసదుద్దీన్ ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. అటు ఎన్డీఏ మిత్రపక్ష నేత అజిత్ పవార్ సైతం దేశవ్యాప్తంగా ఈ నిషేధాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి నిషేధాలు సరికాదని అభిప్రాయ పడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+