న్యూ ఇయర్ వేడుకల్లో ఎన్ని లక్షల మంది ఓయో రూమ్స్ బుక్ చేసుకున్నారో తెలుసా..?

నూతన సంవత్సరం అంటే కేవలం ఒక కొత్త తేదీ మాత్రమే కాదు. అది గత సంవత్సరానికి వీడ్కోలు పలికి, కొత్త ఆశలతో, కొత్త ఆకాంక్షలతో ముందుకు సాగేందుకు మనకు ఒక అవకాశం. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వివిధ సంప్రదాయాలతో, విధానాలతో ఈ రోజును జరుపుకుంటారు.మన దేశంలో కూడా యూత్ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. నూతన సంవత్సర వేడుకలను యువత గ్రాండ్‌గానే సెలబ్రేట్ చేసుకున్నారు.

యూత్‌ను ఆకట్టుకోవడానికి రకరకాల ఈవెంట్స్ పేరుతో పబ్‌ల యాజమానులు ముందుకొచ్చారు. ఇదిలా ఉంటే న్యూ ఇయర్ వేడుకల సమయంలో ఓయో రూమ్స్ బుకింగ్ కూడా రికార్డు స్థాయిలో జరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. యూత్ ఎక్కువగా ఓయో రూమ్స్ బుకింగ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో ప్రేమికులు పార్క్‌లను తమ అడ్డగా మార్చుకునేవారు. కానీ కాలక్రమేణ లవర్స్ ఏకాంతంగా గడపటానికి ఎక్కువగా ఓయో రూమ్స్‌ను తమకు బెస్ట్ ఛాయిస్‌గా ఎంపిక చేసుకుంటున్నారు.

OYO rooms bookings are at a record level during the New Year celebrations

ఓయో రూమ్స్ లవర్స్‌గా అడ్డగా మారిపోయిందనే చెప్పాలి. ఓయో రూమ్స్ పట్ల సమాజంలో ఏ రకమైన భావన ఉందో అందరికీ తెలిసిందే. నార్మల్ ఫ్యామిలీస్ ఓయో రూమ్‌ అంటేనే అసహ్యించుకునే రోజులు వచ్చాయి. అసాంఘిక కార్యకలాపాలకు ఓయో రూమ్స్ అడ్డాగా మారాయి. వ్యక్తిగత సమాచారంతో పాటు, ఫోన్ నెంబర్ తీసుకున్న తర్వాతే రూం ఇవ్వడం జరుగుతోంది. తాజాగా జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో ఓయో రూమ్స్‌‌కు ప్రేమికులు క్యూ కట్టారు. ఇదే సమయంలో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి చాలామంది గ్రామాల నుంచి వారు కూడా ఓయో రూమ్స్‌ బుక్ చేసుకున్నారు. 10 లక్షల మందికి పైగానే ఓయో రూమ్స్ బుక్ చేసుకున్నట్టు యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+