Pahalgam tour: హైదరాబాద్ టూ పహల్గామ్ టూర్.. బడ్జెట్ ధరలోనే 'మిని స్విట్జర్లాండ్' ను చుట్టిరండి..!

తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల్లో దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది పేరెంట్స్​ లాంగ్​ టూర్లు ప్లాన్​ చేస్తుంటారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎల్ నినో ప్రభావంతో వేసవి కంటే ఎక్కువగా ఎండలు ప్రతాపం చూపిస్తున్నాయి. ఈ క్రమంలో సరదాగా దసరా సెలవుల్లో చిల్ అయ్యేందుకు దూరపు ప్రదేశాలకు వెళ్లేందుకు ఇంట్రస్ట్​ చూపిస్తుంటారు. అలాంటి వారికోసం బెస్ట్ ఆప్షన్ కాశ్మీర్ టూర్ అని చెప్పొచ్చు. కశ్మీర్ లోని శ్రీనగర్‌ అందాలు, మంచు కొండల్లో రోప్‌ వే ప్రయాణం అలాగే ఎతైన మంచు కొండలు, పచ్చని పర్వతాల మధ్య జర్నీ పర్యాటకులను కట్టిపడేస్తుంది. అంతేకాక పచ్చని లోయలు, సరస్సులు, పూల మైదానాలు, హిమనీ నదాలు.. ప్రకృతి అందాలకు కశ్మీర్ పెట్టింది పేరని చెబుతారు. అందుకే కాశ్మీర్ ను భూతల స్వర్గంగా భావిస్తారు. ఈ క్రమంలో ఒక్కసారైనా కశ్మీర్​ అందాలు చూడాలని చాలామందికి కోరికగా ఉంటుంది. మరి ఈ క్రమంలోనే IRCTC ప్రత్యేకమైన ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.

హైదరాబాద్ నుంచి కాశ్మీర్ కు వెళ్లాలనుకునే పర్యాటకుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా గుల్మార్గ్, పహల్గామ్, సోన్‌ మార్గ్, శ్రీనగర్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది. ఈ టూర్ మొత్తం 5 రాత్రులు, 6 రోజుల పాటు ఉంటుంది. హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఈ జర్నీ స్టార్ట్ అవుతుంది. శ్రీ నగర్ కు విమాన ప్రయాణం చేసి అక్కడి నుంచి వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా ఈ ప్రత్యేకమైన టూర్ ‌ను రూపొందించారు. ఇక హోటల్ వసతి, బ్రేక్‌ ఫాస్ట్, డిన్నర్, ప్రయాణ సౌకర్యాలతో పాటు టూర్ ఎస్కార్ట్ సేవలు కూడా ప్యాకేజీలో ఉండటం విశేషం.

ఈ టూర్ లో భాగంగా తొలిరోజు హైదరాబాద్ నుంచి శ్రీనగర్ కు జర్నీ ఉంటుంది. అక్కడి హోటల్ లో బస చేసిన తర్వాత రెండో రోజున సోన్‌ మార్గ్ ప్రాంతంలోని అందాలను ఆస్వాదించే వీలుంది. సోన్ మార్గ్ లో చుట్టూ మంచుతో కప్పి ఉన్న ఎత్తయిన పర్వతాలు, పచ్చని ప్రకృతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అలాగే మూడో రోజు గుల్మార్గ్ ట్రిప్ ఉంటుంది. కశ్మీర్‌ లోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో గుల్మార్గ్ ఒకటి. ఇక నాలుగోరోజు పహల్గామ్ ప్రకృతి అందాలను తనివితీరా ఆస్వాదించే అవకాశం ఉంది. పహల్గామ్ ను షెపర్డ్స్ వ్యాలీ అని పిలుస్తుంటారు. ఇక్కడ బేతాబ్ వ్యాలీ, చందర్ వారి, బైసరన్ వ్యాలీ ఫేమస్.. బైసరన్ వ్యాలీని మిని స్విట్జర్లాండ్ అని పిలుస్తుంటారు. అలాగే ఇక్కడ లిడ్డర్ నది అందాలు, రివర్ రాఫ్టింగ్, ట్రెక్కింగ్ అండ్ క్యాంపింగ్ లాంటి అడ్వెంచర్ ఆటలు కూడా ఆడొచ్చు.

Pahalgam tour from Hyderabad during the Dussehra holidays Here is tour plan that fits your budget

ఐదో రోజు శ్రీనగర్ కు చేరుకుని చెక్ ఇన్ చేసి డిన్నర్ చేసి అక్కడే రాత్రి బస చేస్తారు. ఇక ఆరో రోజు శ్రీనగర్ నుంచి హైదరాబాద్‌ కు విమానంలో చేరుకోవడంతో టూర్ పూర్తి అవుతుంది. ఈ మేరకు ఈ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక IRCTC వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+