ప్రియుడిని కొట్టి, ప్రియురాలిని ఎత్తుకెళ్లిన పేరెంట్స్: నల్గొండలో ప్రియుడి తల్లి మృతి

హైదరాబాద్: ఆర్య సమాజ్‌లో ప్రేమికుల పైన సోమవారం దాడి జరిగింది. ప్రేమ వివాహం చేసుకునేందుకు వచ్చిన యువతి, యువకుడి పైన తల్లిదండ్రులు దాడి చేసి అమ్మాయిని ఎత్తుకెళ్లారు. యువకుడిని తీవ్రంగా కొట్టి, యువతిని ద్విచక్ర వాహనం పైన ఎత్తుకెళ్లారు.

అమ్మాయిని తల్లిదండ్రులు బలవంతంగా లాక్కెళ్లారు. యువతీ, యువకుడు ప్రేమ వివాహం చేసుకునేందుకు ఆర్య సమాజ్ వచ్చారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆర్య సమాజ్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం కనిపించింది.

జెడ్పీటీసీలకు టోకరా వేసిన మధు అరెస్ట్

Parents attack on lovers at Arya Samaj

జెడ్పీటీసీలకు టోకరా వేసిన మధు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ జిల్లాకు చెందిన మధు పథకాల పేరు చెప్పి జెడ్పీటీసీల నుండి పెద్ద మొత్తంలో వసూలు చేశారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, బండారం బయటపడింది.

తెలంగాణ సీఎస్ పేరు చెప్పి మధు జెడ్పీటీసీలకు టోకరా వేశాడు. పథకాలు, కాంట్రాక్టుల పేరు చెప్పి డబ్బు వసూలు చేశాడు. జెడ్పీటీసీలు సీఎస్ కార్యాలయాన్ని కలవడంతో అసలు విషయం తెలిసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నైజీరియన్ ఆన్ లైన్ మోసం

ఆన్‌లైన్లో మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్ అరెస్టయ్యాడు. కర్నూలు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నుంచి లక్షా 79వేలకు పైగా రూపాయలు వసూలు చేశాడు. అతనిని పోలీసులు అరెస్టు చేశారు.

బాచుపల్లి ప్రయివేటు కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

బాచుపల్లి శివారు ప్రాంతంలోని ఓ ప్రయివేటు కళాశాల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. కాలేజీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులు ఫర్నీచర్ ధ్వంసం చేశారు. విద్యార్థి నిజామాబాద్ జిల్లా కామారెడ్డివాసి.

ప్రేమ వ్యవహారంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

ప్రేమ వ్యవహారంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడిన సంఘటన నల్గొండ జిల్లాలోని పెద్దపూర మండలం వెలమగూడెంలో చోటుచేసుకుంది. ఓ యువతి పెళ్లి జరగకుండా అడ్డుకునేందుకు యువకుడు యత్నించాడు. ఈ విషయమై పెద్ద మనుషుల సమక్షంలో సోమవారం పంచాయతీ నిర్వహించారు.

ఈ క్రమంలో మాటామాటా పెరిగి ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణ హింసాత్మకంగా మారడంతో యువకుని తల్లి మృతి చెందింది. దీంతో అమ్మాయి తరపు బంధువులు పారిపోయారు. ఆగ్రహంతో ఊగిపోయిన యువకుని తరపు బంధువులు అమ్మాయి ఇంటిపై దాడి చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణను నివారించేందుకు గ్రామంలో పోలీసులు పికెట్‌ను ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+