5నిమిషాల్లో పెళ్లి: సినీ ఫక్కీలో ప్రేమజంటపై దాడి, అమ్మాయిని ఎత్తుకెళ్లారు
Recommended Video

నిజామాబాద్: ఐదు నిమిషాల్లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతున్న ప్రేమజంటను విడదీశారు అమ్మాయి తరపు కుటుంబసభ్యులు, బంధువులు. పెద్దలను కాదని ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకోబోతున్న జంటపై దాడి చేసి విడగొట్టారు. సినీ ఫక్కీలో జరిగిన ఘటన నిజామాబాద్‌లో బుధవారం చోటు చేసుకుంది.

అమ్మాయిని లాక్కెళ్లిపోయారు
పదుల సంఖ్యలో బైక్‌లు, ఆటోల్లో ఆర్యసమాజ్‌కు చేరుకున్న అమ్మాయి తరపు కుటుంబసభ్యులు, బంధువులు పెళ్లిని నిలిపేయాలంటూ ఆర్య సమాజ్ సభ్యులను కోరారు. ఏదైనా సమస్య ఉంటే బయట తేల్చుకోవాలని వారు చెప్పడంతో అమ్మాయి(సౌజన్య)ని లాక్కెళ్లిపోయారు.

వరుడిని చితకబాది.. అమ్మాయిని భుజాన వేసుకుని..
ఇంతలో వరుడు(ప్రాణదీప్) అడ్డుపడటంతో అతడ్ని చితకబాదారు. తమ రావడానికి నిరాకరిస్తున్న అమ్మాయిని కూడా కొట్టారు. ఆ తర్వాత ఆమెను భుజాన వేసుకుని బైక్‌పై ఇంటికి తీసుకెళ్లారు. దీంతో నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న ఆ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటవకుండానే విడిపోయారు.

ఉద్రిక్త పరిస్థితులు
ఈ ఊహించని ఘటనతో ఆర్య సమాజ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, బదిలీల హడావుడిలో ఉన్న పోలీసులు.. ఇక్కడికి వచ్చేసరికి అంతా జరిగిపోయింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

ప్రేమికుడి ఆవేదన
లీగల్‌గా పెళ్లి చేసుకుంటుంటే అమ్మాయి తరపు కుటుంబసభ్యులు అమ్మాయిని కొట్టుకుంటూ ఎత్తుకెళ్లారని వరుడు ప్రాణదీప్ తెలిపారు. తనపై కూడా దాడి చేశారని చెప్పాడు. సౌజన్య మేజర్ కావడంతో తమ పెళ్లి జరిపించాలని టూటౌన్ పోలీసులను ఆశ్రయించాడు కోరాడు. అమ్మాయి తరపు బంధువుల దాడిలో గాయపడిన ప్రాణదీప్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.












Click it and Unblock the Notifications