పట్నం నరేందర్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలి..! హైకోర్ట్ లో రేవంత్ రెడ్డి పిటీషన్..!!
హైదరాబాద్: తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి మౌనముద్రలోకి వెళ్లిపోయారు. అప్పుడప్పుడు కొడంగల్ లో జరిగే కార్యక్రమాలకు హాజరవ్వడం మినహా ఆయన పెద్దగా ప్రజా జీవితంలోకి రావడం లేదు. పంచాయితీ ఎన్నికల సంరర్బంగా సర్పంచ్ విషయంలొ మీడియా ముందుకు వచ్చిన రేవంత్ రెడ్డి తర్వాత మళ్లీ ఎక్కడా కనిపించలేదు. తాజాగా కొండంగల్ లో టీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి ఎన్నకల సందర్బంగా అక్రమాలకు పాల్పడ్డాడంటూ, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసారు రేవంత్ రెడ్డి.

మళ్లీ రగిలిన కొడంగల్ రచ్చ..! నరేందర్ రెడ్డి పై సాక్ష్యాలతో పిటీషన్ వేసిన రేవంత్..!!
కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి తలెంగాణ ముందస్తు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే ఏ. రేవంత్ రెడ్డి హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో కోస్గి లోని నరేందర్ రెడ్డి పామ్ హౌస్ పై ఐటీ దాడులు జరగ్గా, 51 లక్షల నగదు, దాదాపు 6 కోట్ల 50 లక్షల ఖర్చుకు సబందించి డైరీ లభ్యమైందని కోర్టుకు విన్నవించారు.

నిధుల దుర్వినియోగం జరిగింది..! నరేందర్ రెడ్డి వాస్తవాలను కప్పిపుచ్చాడన్న రేవంత్..!!
కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఆదాయపు పన్ను అధికారులు నివేదిక ఇచ్చారు. 51లక్షల నగదు దొరికినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిందన్నారు. అయితే ఎన్నికల్లో 19 లక్షలు ఖర్చు చేసినట్లు నరేందర్ రెడ్డి లెక్కలు చూపించారని పిటీషన్ లో తెలిపారు. షాబాద్ లో నరేందర్ రెడ్డి పేరు మీద పెట్రోల్ పంపు ఉందని, పెట్రోల్ పంపు లైసెన్స్ ఉంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అన్నట్టు పిటీసన్ లో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

సాక్ష్యాలతో కోర్టు మెట్టెక్కిన రేవంత్ రెడ్డి..! నరేందర్ రెడ్డి ఏం చేస్తారో..!!
తనకు పెట్రోల్ పంపు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొనకుండా నరేందర్ రెడ్డి తప్పుడు సమాచారం ఇచ్చారని రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు. ఎన్నికల ఖర్చులకు విదేశాల నిధులు తీసుకోవడం నిషేధం, ఆ విరాళాలు తీసుకున్నట్లయితే పోటీ కి వాళ్ళు అనర్హులు. అమెరికా నుంచి ఎన్నికల ఖర్చుకోసం 5లక్షలు వచ్చినట్లు అఫిడవిట్ లో చూపించారు. ఈ మూడు ఉల్లంఘనలను పరిగణనలోకి తీసుకుని నరేందర్ రెడ్డి ని అనర్హుడిగా ప్రకటించాలని రేవంత్ రెడ్డి కోరారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల కేసులను 6 నెలల్లోపు విచారించి తీర్పునివ్వాల్సి ఉంటుంది.

మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలు కూడా కేసు దాఖలు..! న్యాయం తమవైపే ఉందంటున్న నేతలు..!!
అంతే కాకుండా గద్వాల నుంచి ఓటమి పాలైన మాజీ మంత్రి డీకే.అరుణ, తన ప్రత్యర్థి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డిపై పిటీషన్ దాఖలు చేశారు. పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్ల మధ్య వ్యత్యాసం ఉందంటూ పిటీషన్ లో తెలిపారు. ఈసీ నిబంధనలను ఉల్లంఘించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేను అనర్హుడిగ ప్రకటించాలని అరుణ కోరారు. ఖైరతాబాద్ నుంచి పోటీ చేసిన దాసోజు శ్రవణ్ కుమార్ కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై పిటీషన్ వేశారు. ఐతే ఓట్ల తమకు పోలవ్వకుండా టీఆర్ఎస్ నాయకులు చివరి రెండు గంటల్లో ఓటర్లను ఏమార్చరని వారు ఆరోపిస్తున్నారు.