నాడు పవన్ కళ్యాణ్ అలా, నేడు మహేష్ బాబు ఇలా!
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎంతో అభిమానగణం ఉన్నవారు జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రిన్స్ మహేష్ బాబులు. వీరు ఏది చేసినా అది ఒకింత చర్చకు దారి తీస్తుందని చెప్పవచ్చు.
2015 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించడం ఒక షాకింగ్ అయితే, బిజెపి - టిడిపి మిత్రపక్షానికి మద్దతు పలకడం గమనార్హం. అదే సమయంలో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్‌తో మహేష్ బాబు గురువారం నాడు సామాజిక అనుసంధాన వేదికల్లో హల్‌చల్ చేయడం గమనార్హం.
తెలుగు రాష్ట్రాల్లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్‌లకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. అభిమాన గణంలో ఎవరికి ఎవరు తీసిపోరని చెప్పవచ్చు. వీరు ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారని భావించవచ్చు!

పవన్ కళ్యాణ్ జనసేనను స్థాపించి టిడిపి - బిజెపి కూటమికి బాహాటంగా మద్దతు పలికారు. మహేష్ బాబు రాజకీయాలకు దూరం. అయితే, తన బావ గల్లా జయదేవ్ టిడిపి తరఫున 2014 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడంతో తన బావకు మాత్రమే మద్దతుగా వ్యాఖ్యలు మాత్రం చేశారు.
మహేష్ బాబు బావ అయిన గల్లా జయదేవ్ పార్టీకి (టిడిపి) పవన్ కళ్యాణ్ నాడు మద్దతు పలికారు. అది ప్రత్యక్షంగా గల్లాకు కూడా మద్దతు అనొచ్చు. ఇక, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొడుకుతో మహేష్ బాబు ఉన్న ఫోటో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.












Click it and Unblock the Notifications