కెసిఆర్‌తో పవన్ కల్యాణ్ రాజీ: టీ న్యూస్‌కు ఇంటర్వ్యూ, కెసిఆర్‌పై ప్రశంసలు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖర రావుతో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజీకి వచ్చినట్లు అర్థమవుతోంది. తెరాస అధికారిక చానెల్‌గా చెప్పే టీ న్యూస్‌కు పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూ ఇవ్వడమే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు.
అంతేకాకుండా కెసిఆర్ ఉద్యమం నడిపిన తీరును ఆయన ప్రశంసించారు. గత ఎన్నికల సమయంలో కెసిఆర్‌పై, ఆయన కూతురు, ప్రస్తుత పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవితపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్‌పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. హైదరాబాదు విషయంలో కూడా తగాదాకు వచ్చేట్లు కనిపించారు.
కానీ, గత రెండేళ్ల కాలంలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ కెసిఆర్‌తో రాజీకి వచ్చినట్లు భావిస్తున్నారు. సర్దార్ గబ్బర్‌సింగ్ ఆడియో విడుదల కార్యక్రమానికి సహకరించినందుకు ఇటీవల ఆయన తెలంగాణ మంత్రులు కెటి రామారావుకు, హరీష్ రావుకు ధన్యవాదాలు కూడా తెలిపారు.

రాష్ట్ర విభజన తీరును కూడా పవన్ కల్యాణ్ అప్పట్లో తప్పు పట్టారు. కానీ ఇప్పుడు దాన్ని ప్రశంసించారు. సాధారణంగా రాష్ట్రం విడిపోయినప్పుడు పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి గానీ ఆంధ్ర, తెలంగాణ విడిపోయినప్పుడు అలా జరగలేదని అన్నారు.
చాలా స్పృహతో రాష్ర్టాన్ని విభజించారనిస ఆ ప్రక్రియలో ఎటువంటి ద్వేషం లేదని అర్థమైందనట్లు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. టీన్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ విధంగా అన్నారు. కేసీఆర్ చాలా స్పృహతోనే ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించారని పవన్ కళ్యాణ్ మెచ్చకున్నారు.
రాష్ట్రం విడిపోయిన తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల బాధ్యత తీసుకుని, అందరికీ భరోసా ఇవ్వడం బాగా నచ్చిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి, భూమికి గౌరవం ఇవ్వడం కూడా బాగా నచ్చిందని పవన్ తెలిపారు.












Click it and Unblock the Notifications