పవన్ దసరా శుభాకాంక్షలు: ‘బతుకమ్మ’పై ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్: ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దసరా పర్వదినం సందర్భంగా నిర్వహించే బతుకమ్మ ఉత్సవాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బతుకమ్మ ఆటపాటలతో ఊరూ వాడలను భక్తి పారవశ్యంతో ముంచెత్తిన ఆడపడుచులకు శుభాభినందనలని అన్నారు.
ఈ సందర్భంగా దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ, దేశ ప్రజలకు తన తరఫున, జనసేన శ్రేణుల తరఫున విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతున్నానని అందులో పేర్కొన్నారు.
దసరా పండగను పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా మహిళలు, యువతులు, చిన్నారులు బతుకమ్మ ఆటలు ఆడారు. గురవారం రాత్రి వర్షంలో కూడా బతుకమ్మ ఆడుతూ పండగను సంబరంగా చేసుకున్నారు. ఇది ఇలావుంటే.. ప్రస్తుతం తమ పార్టీ సభ్యత్వాలపై దృష్టిపెట్టిన పవన్ కళ్యాణ్ మరోవైపు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తూ బిజీబిజీగా ఉన్నారు.












Click it and Unblock the Notifications