సంగారెడ్డిలోని పురాతన పాఠశాలలో పవన్ కుమారుడు అడ్మిషన్.. కారణం ఇదేనా..?
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ ను స్కూల్ లో చేర్చేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని ఇక్రిశాట్ స్కూల్ ను ఆయన సందర్శించారు. శుక్రవారం ఆయన స్వయంగా ఇక్రిశాట్ స్కూల్ కు వచ్చి కుమారుడి అడ్మిషన్ తీసుకున్నట్లు సమాచారం.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్నకుమారుడు మార్క్ శంకర్ ను సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలోని ఇక్రిశాట్ స్కూల్ లో జాయిన్ చేపించినట్లు సమాచారం అందుతోంది. పవన్ కల్యాణ్ స్వయంగా వచ్చి మార్క్ శంకర్ కు అడ్మిషన్ తీసుకుని జాయిన్ చేశారు. పవన్ రాకతో స్కూల్ యాజమాన్యం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆయన్ను గౌరవ మర్యాదలతో పాఠశాల యాజమాన్యం ఆహ్వానించింది.

ఏప్రిల్ 7, 2025న సింగపూర్ లోని ఓ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ చిన్నకుమారుడు 8 ఏళ్ల మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు పొగ పీల్చడం వల్ల బాలుడు స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. సింగపూర్‌లోని ఓ ఆసుపత్రిలో అతనికి చికిత్స అందించి కోలుకున్నాక స్వయంగా పవన్ కల్యాణ్ వెళ్లి ఆ కుటుంబాన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు.
ఈ ప్రమాదం తర్వాత ఇప్పుడు మార్క్ శంకర్ పూర్తిగా కోలుకున్నాడు. దీంతో బాలుడ్ని తిరిగి సింగపూర్ పంపించకుండా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేపించాలని పవన్ కల్యాణ్ భావించారు. అందులో భాగంగానే మార్క్ శంకర్ ను సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని ఇక్రిశాట్ స్కుూల్ లో చేర్పించేందుకు శుక్రవారం వచ్చారు. అక్కడి టీచర్లతో మాట్లాడి మార్క్ శంకర్ కు అడ్మిషన్ తీసకున్నారు.
మార్క్ శంకర్ అడ్మిషన్ కోసం పవన్ కళ్యాణ్ గారు పఠాన్ చెరువు ఇక్రిశాట్ లోని ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ లో ❤️😍 pic.twitter.com/SkReFeUFeV
— SURENDRA PILLELLA (@SURENDRAPILLEL1) June 13, 2025
అయితే ఇక్రిశాట్.. ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ స్కూల్ 1981లో స్థాపించబడింది. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ పాఠశాల ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా విదేశీ విద్యార్థులే ఉంటారు. దాదాపు 22 దేశాల నుంచి దాదాపు 400 మంది విదేశీ విద్యార్థులు ఇక్కడ పాఠాలు నేర్చుకుంటున్నారు. అయితే మార్క్ శంకర్ విదేశీ విద్యకు అలవాటు పడటంతో అతన్ని ఈ స్కూల్ లో చేర్పించేందుకు పవన్ కల్యాణ్ సిద్దమైనట్లు సమాచారం అందుతోంది.












Click it and Unblock the Notifications