ఫ్యాన్స్ ఉత్సాహం: గాయపడ్డ అభిమానిని చూసి చలించిన పవన్ కళ్యాణ్
కరీంనగర్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరీంనగర్ జిల్లా పర్యటనలో చలించిపోయారు. ఓ అభిమాని గాయపడి అతని తల నుంచి రక్తం కారడంతో ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని పురమాయించారు. పవన్ చలోరే చల్ యాత్ర కరీంనగర్‌లో మంగళవారం కొనసాగింది.
ఆయన శుభం గార్డెన్‌లో కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను పిలిస్తే, తన కోసం వచ్చి తీవ్రంగా గాయపడిన ఓ అభిమానిని చూపిస్తూ పవన్ భావోద్వేగంతో మాట్లాడారు. మూడు జిల్లాల అభిమానులను కలిసిన పవన్.. అభిమానులు అత్యుత్సాహాన్ని ఎక్కువగా చూపవద్దని కోరారు.

అద్దాలు పగిలిన కారణంగా గాయాలపాలై, చొక్కా అంతా రక్తం నిండినా, పవన్‌ను దగ్గరగా చూసేందుకు ఆతృతపడుతున్న అభిమానిని స్టేజ్ పైకి పిలిచి మాట్లాడారు. అతనిని ఆసుపత్రికి పంపించాలని సూచించారు. తాను ఎంతో ఇష్టపడే అభిమానులకు ఇటువంటి ఘటనలు ఎదురైతే తాను తట్టుకోలేనని అన్నారు. ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని తెలిపారు. అభిమానులు 'సీఎం సీఎం' అని నినాదాలు చేస్తుంటే వారిని వారించారు.












Click it and Unblock the Notifications