వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్‌ను తెలంగాణ కూడా కోరుకుంటోంది! 21గంటల్లో 30 లక్షల మంది..

2019 ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ పోటీ చేయడం ఖాయమని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి నేమూరి శంకర్ గౌడ్‌ అన్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 2019 ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ పోటీ చేయడం ఖాయమని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్‌ అన్నారు.

పవన్ బర్త్ డే ఘనంగా

పవన్ బర్త్ డే ఘనంగా

పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ముషీరాబాద్‌ నియోజకవర్గం జనసేన నాయకుడు బిట్ల రమేష్‌ ఆధ్వర్యంలో రాంనగర్‌ చౌరస్తాలో శనివారం నిర్వహించిన జన్మదిన వేడుక, బహిరంగ సభకు శంకర్ గౌడ్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడారు.

తెలంగాణ, ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు

తెలంగాణ, ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు

తెలుగు రాష్ట్రాల ప్రజలు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో జనసేనను బలోపేతం చేయడానికి పార్టీ శ్రేణులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని, త్వరలోనే పార్టీ కమిటీలు వేయనున్నామన్నారు.

21 గంటల్లో 30 లక్షల మంది..

21 గంటల్లో 30 లక్షల మంది..

పవన్‌ కళ్యాణ్‌కు అభిమానులు జన్మదిన శుభాకాంక్షలతో ముంచెత్తారు. అభిమానుల కోసం జనసేన పార్టీ ప్రత్యేకంగా హ్యాపీ బర్త్‌డే లీడర్‌ పవన్‌ కళ్యాణ్‌ ట్విట్టర్‌ ఖాతాను తెరచింది. దీనికి 21 గంటల్లోపు ఏకంగా 30 లక్షల మంది శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు కూడా ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

పోటీపై ఇలా

పోటీపై ఇలా

కాగా, జనసేన బలాన్ని బట్టే ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేసేదీ నిర్ణయిస్తానని పవన్‌ కళ్యాణ్ చెప్పిన విషయం తెలిసిందే. ఎన్ని స్థానాల్లో పోటీ చేయడం అంటే మనకు బలముంటే 175 స్థానాల్లోనూ పోటీ చేస్తామని, మన బలమెంతుంటే అంత పోటీ చేద్దాం, ఇప్పుడే దానిపైన నేనేమీ చెప్పలేనని అన్నారు.

English summary
Jana Sena chief Pawan Kalyan fans celebrated his birthday on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X