Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో "జనసేన" పోటీ..!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఏపీలో పదేళ్ల తర్వాత 100% స్ట్రైక్ రేటుతో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. అంతకు ముందు కూడా పొత్తు వ్యవహారంలో టీడీపీకి - బీజేపీకి మధ్య సయోధ్య కుదిరించే విషయంలో కూడా ముఖ్య పాత్ర పోషించారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పేరొందారు. ప్రధాని మోడీ కూడా స్వయంగా ప్రతి సభలోనూ పవన్ ను ఆకాశానికి ఎత్తేస్తూ వ్యాఖ్యానించడం చూస్తూనే ఉంటున్నాం.

ఈ క్రమంలోనే ఏపీలో యాక్టివ్ గా ఉన్న జనసేనను తెలంగాణలో కూడా ఫామ్ లోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికా రూపొందిస్తున్నట్టు కనిపిస్తుంది. హైదరాబాద్‌లో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీ పూర్తిగా సిద్ధంగా ఉందని జనసేన గ్రేటర్ అధ్యక్షుడు రాజలింగం ప్రకటించారు. ఎన్నికల ముందు పార్టీ శక్తి, వ్యూహాలపై చర్చించేందుకు ఆయన కూకట్‌పల్లిలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.

pawan-kalyan-janasena-party-participating-in-ghmc-elections

ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి నేమూరి శంకర్‌గౌడ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పార్టీని మరింత బలపరచడం, కార్యకర్తలను సమీకరించడం ఇప్పుడు అత్యంత ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. నగరంలోని ప్రతి డివిజన్‌లో కేడర్‌ను యాక్టివ్‌గా ఉంచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అలానే జనసేన కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రేమ్‌కుమార్, వీర మహిళ చైర్మన్ కావ్య, ప్రధాన కార్యదర్శి దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విభాగాల వారీగా బాధ్యతలు, గ్రౌండ్ రిపోర్టులు, స్థానిక ఇష్యూలపై నాయకులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

సమావేశంలో GHMC ఎన్నికల్లో జనసేన సత్తా చాటేందుకు పలు వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు. బూత్ స్థాయి కేడర్‌ను బలోపేతం చేయడం, ప్రతి డివిజన్‌కు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేయడం, యువత, మహిళలపై దృష్టి పెట్టడం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయని తెలిపారు. నాయకులు ప్రజల వద్దకు చేరుకునే డోర్-టు-డోర్ ప్రచార కార్యక్రమాలపై కూడా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు స్పష్టం చేశారు. స్థానిక ప్రజా సమస్యలు, GHMCలో పరిష్కారం కావాల్సిన ముఖ్య అంశాలపై వర్క్‌లిస్ట్ తయారు చేయాలని నేతలకు సూచించారు.

ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో మొత్తం 150 డివిజన్లు (కార్పొరేటర్ సీట్లు) ఉన్నాయి. ఈ 150 సీట్లలో 76 సీట్లు గెలిస్తేనే ఒక పార్టీకి స్పష్టమైన మెజారిటీ లభిస్తుంది. సాధారణంగా GHMC ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఎక్కువగా ఉండటంతో.. ఈ మెజారిటీని సాధించడం కష్టంగా అభిప్రాయపడుతున్నారు. GHMC పరిధిలో ఓటర్ల సంఖ్య కూడా భారీగా ఉంటుంది. తాజా లెక్కల ప్రకారం, నగరంలో మొత్తం 92.5 లక్షలకుపైగా ఓటర్లు నమోదు అయ్యారు. అర్బన్ ఓటర్లలో యువత శాతం ఎక్కువ కావడంతో, GHMC ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం కూడా గణనీయంగా కనిపిస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+