తెలంగాణలో తేలిపోయిన పవన్ కల్యాణ్.. నోటా కన్నా దారుణంగా జనసేనకు ఓట్లు
తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. గతనికి భిన్నంగా ఈసారి ఫలితాలు వెలువడుతున్నాయి. 2014,2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టిన తెలంగాణ ప్రజలు... ఈసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినట్టు స్పష్టం అవుతుంది. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే అధిక్యంలో ఉన్నారు. పదిమంది మంత్రులు ఓటమి అంచున ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎలాంటి ఫలితాలు రాబడుతుందో అర్థం చేసుకోవచ్చు.
అధికార బీఆర్ఎస్ పార్టీ 40 స్థానాలు కూడా దాటే పరిస్థితి కనిపించడం లేదు. ఇక బీజేపీ ఈ ఎన్నికల్లో గతంలో కంటే మెరుగైన ఫలితాలనే సాధించేలా కనిపిస్తుంది. 2018 ఎన్నికల్లో ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించిన బీజేపీ ..ఈసారి 5 స్థానాలకు పైగానే విజయం సాధించేలా కనిపిస్తుంది. మరో పక్క బీజేపీ మిత్రపక్షం అయినా జనసేన మాత్రం ఈ ఎన్నికల్లో తేలిపోయిందనే చెప్పాలి. ఆ పార్టీ అభ్యర్థులు నోటాతో పోటీ పడుతున్నారు.

ఇప్పటి వరకూ వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే.. జనసేన ఒక్క కూకట్‌పల్లిలో మినహాయిస్తే..మిగిలిన స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ప్రభావం చూపలేకపోయారు. కొన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులు నోటా కన్నా దారుణంగా ఓట్లు సాధించడంపై ఆ పార్టీ నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో సెంట్రల్ ఆఫ్ ది ఎట్రాక్షన్‌గా మారిన బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా జనసేన అభ్యర్థులు మొత్తం సాధించలేకపోయారు. ఓసారి తెలంగాణలో జనసేన అభ్యర్థులకు వచ్చిన ఓట్లను పరిశీలిద్దాం..
వైరా నియోజకవర్గంలో జనసేన అభ్యర్థికి 498 ఓట్లు రాగ నోటాకు 321 ఓట్లు వచ్చాయి. తాండూర్ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థికి పడగ 95, నోటాకు 21 ఓట్లు పోల్ అయ్యాయి.ఖమ్మం నియోజకవర్గంలో జనసేనకు 88 పోల్ అవ్వగా, నోటాకు 64 పోల్ అయ్యాయి. కొత్తగూడెంలో జనసేన అభ్యర్థికి 118 నోటాకు 112 ఓట్లు పోల్ అయినట్లు లెక్కలు చెబుతున్నాయి. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో జనసేనకు 310 ఓట్లు నమోదు అవ్వగా, నోటాకు 187 ఓట్లు వచ్చాయి. కోదాడ నియోజకవర్గానికి సంబంధించి పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది.
కూకట్‌పల్లిలో మాత్రం జనసేన అభ్యర్థి కాస్తా మెరుగైనా ఓట్లు రాబట్టారనే చెప్పాలి. కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన అభ్యర్థి 5306 ఓట్లు సాధించి మూడో స్ధానంలో కొనసాగుతున్నారు. ఇక ఇప్పటికే ఫలితం వెలువడిన అశ్వారావుపేట నియోజకవర్గంలో జనసేనకు 682 ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తనికి ఈ ఎన్నికలతో పవన్ కల్యాణ్‌కు తెలంగాణలో స్థానం లేదని ఈ ఘటనతో మరోమారు రుజువైంది.












Click it and Unblock the Notifications