పవన్, బీజేపీ మధ్య ఏం జరుగుతోంది - అనూహ్య పరిణామాలు..!!
పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ తాజా నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది. ఈ నిర్ణయం బీజేపీ నేతలకు రుచించటం లేదు. జనసేన మాత్రం తాజా నిర్ణయంలో మరో ఆలోచన లేదని తేల్చి చెబుతోంది. ఈ పరిణామాల పైన ఢిల్లీ బీజేపీ నాయ కత్వం ఆరా తీసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీ నేతలు తమ వైఖరి స్పష్టం చేసారు. దీంతో, అసలు ఏం జరుగుతోందనేది రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.
ఎన్డీఏలో జనసేన భాగస్వామిగా ఉంది. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. డిప్యూటీ సీఎం పవన్ ఏపీలో కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. బీజేపీ నాయకత్వం పైన ప్రతీ సందర్భంలోనూ అనుకూలంగా వ్యవహరించారు. అయితే, తాజాగా తెలంగాణలో తీసుకున్న రాజకీయ నిర్ణయం మాత్రం ఆసక్తి కరంగా మారుతోంది. తెలంగాణలో గతంలో బీజేపీతో కలిసి పొత్తు తో పోటీ చేసిన జనసేన.. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని డిసైడ్ అయింది. ఈ మేరకు ఇప్పటికే పార్టీ కమిటీలతో పాటుగా ఎన్నికల్లో పోటీకి వీలుగా నాయకత్వం కార్యాచరణ ఖరారు చేస్తోంది. ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు తమకు మున్సిపల్ ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉండదని ప్రకటించారు. ఏపీ వరకే కూటమి.. పొత్తులు కొనసాగుతాయని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో రాంచందర్ రావు చేసిన వ్యాఖ్యలపై జనసేన ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ స్పందించారు. తెలంగాణపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు అమితమైన ప్రేమ ఉందని తెలిపారు. రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని పేర్కొన్నారు.

కాగా, ఎన్నికల కోసం అడ్‌హక్ కమిటీలు కూడా వేసుకున్నామని వెల్లడించారు. తెలంగాణలో త్వరలోనే పవన్ కల్యాణ్ పర్యటిస్తారని తెలిపారు. సమావేశాలు కూడా ఉంటాయని చెప్పారు. తెలంగాణలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనే లక్ష్యంతో ఇప్పటికే కార్యాచరణను ప్రారంభించినట్లు తెలిపారు. ఎన్నికలకు నెల రోజుల కంటే తక్కువ సమయం ఉన్నప్పటికీ.. సాధ్యమైనన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులకు బరిలో దించుతామని పేర్కొన్నారు. తెలంగాణలో సరికొత్త రాజకీయ వేదికకు బలమైన పునాది వేయడమే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ప్రకటించారు. తెలంగాణలో బలంగా ఉన్ నామని.. అధిష్ఠానానికి కూడా ఇదే విషయం చెబుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్ర రావు చెప్పారు. దీంతో.. బీజేపీ అధినాయకత్వం తెలంగాణ లో పరిణామాల పైన ఆరా తీసినట్లు తెలిసింది. ఢిల్లీ వేదికగా జనసేనతో పొత్తు కోసం నిర్ణయం తీసుకుంటారా... వేర్వేరుగా పోటీ చేస్తారా.. పవన్ ఏం చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications