కొత్త ట్విట్టర్ ఖాతాను తెరిచిన పవన్ కళ్యాణ్, ఎందుకంటే
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ కొత్త ఖాతాను తెరిచారు. తన మనసులోని భావాలను, అభిప్రాయాలను ప్రజలు, అభిమానులతో పంచుకునేందుకు పాత అకౌంట్‌ను ఉపయోగిస్తున్నారు.
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ కొత్త ఖాతాను తెరిచారు. తన మనసులోని భావాలను, అభిప్రాయాలను ప్రజలు, అభిమానులతో పంచుకునేందుకు పాత అకౌంట్‌ను ఉపయోగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన కొత్తగా PK Creative Worksపేరుతో కొత్త ఖాతా తెరిచారు. ఈ అకౌంట్‌ను పూర్తిగా సినిమాలకు చెందిన విషయాలను వెల్లడించడానికి ఉపయోగించనున్నారు.

ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు ప్రేమను, శక్తిని ఇచ్చిన సినీ రంగానికి గౌరవాన్ని, ప్రేమను ఇవ్వాలనుకుంటున్నానని, సమాజానికి మరింత మెరుగైన సేవ చేసేందుకు ఈ రంగాన్ని ఉపయోగించుకుంటానని, ఈ కొత్త ట్విట్టర్ అకౌంటును పూర్తిగా సినిమాల కోసమే ప్రారంభించానని తెలిపారు.












Click it and Unblock the Notifications