తెలంగాణపై పవన్ కళ్యాణ్ దృష్టి, 'అన్నిస్థానాల్లో పోటీకి సిద్ధం'

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. ఏపీ పర్యటన అనంతరం తెలంగాణ రాష్ట్రంలోను పర్యటించనున్నారని తెలుస్తోంది. ఏపీలో ఉత్తరాంధ్ర పర్యటన అనంతరం గోదావరి జిల్లాల్లో జనసేనాని పర్యటిస్తున్నారు.

మిగతా జిల్లాల్లో పర్యటించిన అనంతరం తెలంగాణపై దృష్టి సారించనున్నారని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో పోటీ చేయాలని పవన్ నిర్ణయించారు. ఏపీలో మొత్తం స్థానాల్లో పోటీ చేయనున్నారు. తెలంగాణలో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారనే విషయం తర్వాత వెల్లడించనున్నారు.

తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన

తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన

పవన్ కళ్యాణ్ ఈ ఏడాది ప్రారంభంలో తెలంగాణలో పర్యటించారు. ఆ సమయంలో ఆయన సంచలన ప్రకటన చేశారు. తాను ఇక సినిమాలను వదిలేస్తున్నానని, పూర్తిస్థాయి రాజకీయాల్లో ఉంటానని వెల్లడించారు. జనసేన బలోపేతంపై దృష్టి సారిస్తాననితెలిపారు. కరీంనగర్ జిల్లాలోని కొండమడుగు దేవాలయం నుంచి తన యాత్ర ప్రారంభించారు. ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికలపై చర్చ

వచ్చే సార్వత్రిక ఎన్నికలపై చర్చ

2019 ఎన్నికలకు ముందు మరోసారి తెలంగాణలో అడుగుపెట్టి, దాదాపు అన్ని జిల్లాల్లో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం జనసేన తెలంగాణ పార్టీ సిద్ధమవుతోంది. రెండు రోజుల క్రితం తెలంగాణ జనసేన పార్టీ నేతలు సమావేశమై.. జనసేనాని పర్యటన, వచ్చే సార్వత్రిక ఎన్నికలపై చర్చించారు.

 తెలంగాణపై దృష్టి

తెలంగాణపై దృష్టి

దీనిపై పార్టీ జనరల్ సెక్రటరీ తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఇప్పటికే జీహెచ్ఎంసీ, హెచ్ఎండీయే ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేస్తున్నామని చెప్పారు. తెలంగాణలోని ఇతర జిల్లాల పైన కూడా దృష్టి సారించామని ఆయన చెప్పారు.

రెండు రాష్ట్రాల్లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్

రెండు రాష్ట్రాల్లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్

పవన్ కళ్యాణ్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని తోట చంద్రశేఖర్ తెలిపారు. ప్రస్తుతం పార్టీ బలోపేతం కోసం ఆయన ఏపీలో పర్యటిస్తున్నారని చెప్పారు. త్వరలో తెలంగాణలోను పర్యటిస్తారన్నారు. వచ్చే ఎన్నికలకు పార్టీ కేడర్‌ను సిద్ధం చేస్తారని చెప్పారు.

పార్టీ మెంబర్‌షిప్ డ్రైవ్

పార్టీ మెంబర్‌షిప్ డ్రైవ్

పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ కన్వీనర్ గంగాధరమ్ మాట్లాడుతూ.. జనసేన వైపు అందరూ ఆకర్షితులవుతున్నారని, ముఖ్యంగా యువత పార్టీ వైపు చూస్తోందని చెప్పారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పార్టీ మెంబర్ షిప్ డ్రైవ్‌ను మరింత ఉత్సాహంగా చేస్తుందని చెప్పారు. దాదాపు అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+