బ్రదర్స్, సిస్టర్స్‌తో 7వ క్లాస్‌లో: పవన్ పాతజ్ఞాపకాలు, 'చిరంజీవి ఊహించి ఉండరు!'
Recommended Video

అమరావతి/హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాతస్మృతులను గుర్తు చేసుకున్నారు. తన సోదరులు, సోదరీమణులతో దిగిన ఫోటోను సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో గురువారం సాయంత్రం పోస్టు చేశారు.
నా అన్నయ్యలు, సోదరీమణులతో నేను 7వ తరగతి చదువుతున్న సమయంలో నెల్లూరులో తీసుకున్న ఫోటో అని పేర్కొన్నారు. చాలాకాలం పాటు తాను బ్రోన్కిట్స్‌తో బాధపడ్డానని, దాని నుంచి కోలుకున్న తర్వాత తీసుకున్న ఫోటో ఇది అని పేర్కొన్నారు.

ఈ ఫోటోను పెద్ద ఎత్తున లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, కామెంట్లు పెడుతున్నారు. ఓ నెటిజన్ పవన్ కళ్యాణ్ సభకు పెద్ద ఎత్తున వచ్చిన జనాలకు సంబంధించిన ఫోటోను పెట్టి గ్రేట్ లీడర్ అని పేర్కొన్నారు.
మరొకరు, ఈ చిన్న పిల్లవాడు 5 కోట్ల మంది తెలుగు ప్రజల భవిష్యత్తు మారుస్తాడాని అప్పట్లో చిరంజీవి గారు కూడా ఊహించి ఉండరని మరో అభిమాని పేర్కొన్నారు. పవన్ ఇటీవల ప్రచారంలో అందరినీ ఆకర్షించిన ఫోటోలు, చిరంజీవి ఫోటోలు పెడుతూ ఆనందిస్తున్నారు. చాలామంది పవన్ పెట్టిన ఫోటో నుంచి జనసేనాని చిన్నప్పటి ఫోటో కట్ చేసి అన్నయ్య సూప్ర అని పేర్కొన్నారు.
With my brothers & sisters , I was in 7th class in Nellore, it was taken after I had just recovered from prolonged bronchitis. pic.twitter.com/cdkrmr1UbV
— Pawan Kalyan (@PawanKalyan) July 5, 2018












Click it and Unblock the Notifications