తెగే దాకా లాగొద్దు: ట్విట్టర్‌లో పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్
హైదరాబాద్: తాజా పరిణామాల నేపథ్యంలో జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో ప్రతిస్పందించారు. నెల్సన్ మండేలా పంథాలో ముందుకు సాగాలని ఆయన రాజకీయ నాయకులకు హితవు చెప్పారు. ఈ ట్వీట్స్ ఆయన ఎవరిని ఉద్దేశించి, ఏ అంశాలను ఉద్దేశించి చేశారనేది తెలియడం లేదు.
పూర్తిగా ఆంగ్లంలో ట్వీట్స్ చేసిన పవన్ కళ్యాణ్ తెగే దాకా లాగొద్దంటూ తెలుగులో ట్వీట్ చేశారు. రాజకీయాలు పరస్పరం ప్రతీకారాలు తీర్చుకోవడానికి కాదని ఆయన అన్నారు. మన రాజకీయ నాయకుల మాదిరిగానే నెల్సన్ మండేలా ఉండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదని ఆయన అడిగారు.

వివక్ష చూపుతున్న ప్రభుత్వం, తెల్ల జాతీయుల పట్ల నెల్సన్ మండేలా వ్యవహరించిన తీరును గుర్తు చేసుకోవాలని ఆయన నాయకులకు సూచించారు. ప్రజల సుదీర్ఘ ప్రయోజనాల కోసం, మంచి కోసం నెల్సన్ మండేలా ఉత్తమ మార్గాన్ని ఎంచుకున్నారని, తద్వారా సివిల్ వార్ జరగకుండా చూశారని ఆయన అన్నారు.
మన రాజకీయ నాయకులు తమ వ్యవహార శైలిని ఇదే విధంగా కొనసాగిస్తే ప్రజలు నష్టపోతారని ఆయన అన్నారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలని ఆయన అన్నారు.
IF POLITICS IS ALL ABOUT SETTLING SCORES,then I wonder, if,the Late Nelson Mandela would have had the same attitude like some of our leaders
— Pawan Kalyan (@PawanKalyan) June 27, 2015 then imagine what he could have done to the South African Apartheid Regime and the white people
— Pawan Kalyan (@PawanKalyan) June 27, 2015 who tortured & humiliated him & the black people for decades.,
— Pawan Kalyan (@PawanKalyan) June 27, 2015 But as a Leader he has chosen a Path of Reconciliation to avoid a civil war and for the larger Good of the people.
— Pawan Kalyan (@PawanKalyan) June 27, 2015 That's the greatness of his Noble leadership and I hope our leaders walk on the Path that he has shown. 'తెగే దాక ఏది లాగద్ధు అంటారు '
— Pawan Kalyan (@PawanKalyan) June 27, 2015 Still.. if the leaders take it to that extent then the very people who put them in Power will suffer. And one has to be aware of it.
— Pawan Kalyan (@PawanKalyan) June 27, 2015 











Click it and Unblock the Notifications