ఎప్పుడూ నేను ఆ వైపే: పవన్, భారత్‌లో పెట్టుబడులపై, లండన్‌లో బిజీబిజీగా (ఫోటోలు)
సినిమాలు, రాజకీయాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్న జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండీ యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ అందిస్తున్న ఎక్సలెన్సీ అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే.
లండన్: సినిమాలు, రాజకీయాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్న జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండీ యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ అందిస్తున్న ఎక్సలెన్సీ అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ అవార్డును ఆయన అందుకున్నారు.
లండన్‌లో పవన్: అంబేద్కర్ మెమోరియల్ సందర్శన, అక్కడి విజిటర్స్ బుక్‌లో ఏం రాశారంటే..?
అవార్డు అందుకున్న పవన్ కళ్యాణ్
పలు ప్రజా సమస్యలపై ఈయన స్పందిస్తున్న తీరుకిగాను పవన్ కళ్యాణ్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. రెండు రోజుల క్రితం 17వ తేదీన బ్రిటన్‌లోని హౌజ్ ఆఫ్ లార్డ్స్ సమావేశంలో ఈ అవార్డును అందుకున్నారు.
భారత్‌లో పెట్టుబడులపై ప్రసంగం
అవార్డు అందుకున్న అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. 'భారత్‌లో పెట్టుబడికి అవకాశాలు' అనే అంశంపై ప్రసంగించారు. భారత్ భిన్నత్వానికి నిదర్శనమని, ధనవంతులు, పేదవారు ఇద్దరికీ అక్కడ చోటు ఉంటుందన్నారు. భారత్‌లో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయన్నారు.
ఎప్పుడు సామాజిక న్యాయం వైపు నిలబడతా
తనకు లభించిన అవార్డు నిస్వార్థంగా సేవలు చేస్తున్న ప్రతీ భారతీయుడికీ అంకితం ఇస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. తాను ఎప్పుడు కూడా సామాజిక న్యాయం వైపే నిలబడతానని చెప్పారు.
అంబేడ్కర్ స్మారక మందిరం సందర్శన
పవన్ అంతకుముందు లండన్‌లోని అంబేడ్కర్ స్మారక మందిరాన్ని సందర్శించారు. అంబేడ్కర్ విగ్రహానికిన నివాళులు అర్పించారు. అనంతరం సందర్శకుల పుస్తకంలో తన అభిప్రాయం రాశారు.
సెల్ఫోన్లో ఫోటోలు తీసుకున్నారు
అక్కడ ఉన్న ఫోటోలను పవన్ కళ్యాణ్ చూశారు. అంబేడ్కర్‌కు సంబంధించిన విశేషాలను పరిశీలించారు. కొన్ని చిత్రాలను ఆసక్తిగా పరిశీలించి తన సెల్ఫోన్లో ఫొటోలు తీసుకున్నారు.
వారితో భేటీ అవుతూ బిజీబిజీగా
కాగా, పవన్ కళ్యాణ్‌కు లండన్‌లో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలతో బిజీబిజీగా గడిపారు. అంబేట్కర్ స్మారక మందిరానికి పవన్ కళ్యాణ్‌తో పాటు అభిమానులు కూడా వచ్చారు.
పవన్ కళ్యాణ్ బిజీబిజీ
కొద్ది రోజులుగా పీఎస్పీకే 25 సినిమా కోసం విదేశాలలో ఉన్న పవన్ కళ్యాణ్ అక్కడి నుండి నేరుగా లండన్ వెళ్లారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిందని తెలుస్తోంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.
త్వరలో పవన్ కళ్యాణ్ యాక్టివ్
పవన్ కళ్యాణ్ త్వరలో రాజకీయాల్లో యాక్టివ్ కానున్నారు. పరిస్థితి చూస్తుంటే 2018 జనవరిలో ఆయన క్రియాశీలకం కానున్నారని తెలుస్తోంది. ఏపీ, తెలంగాణలలో అన్ని నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.