పవన్ కల్యాణ్ వాహనం వల్లే ఎస్సై ఆస్పత్రి పాలు: అసిస్టెంట్‌ను పంపి...

ఖమ్మం: జనసేన అధినేత ఖమ్మం పర్యటనలో గాయపడిన ఎస్సై చిరంజీవి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అంతకు ముందు సజావుగా సాగిన పవన్ కల్యాణ్ పర్యటనలో బుధవారం మాత్రం అపశ్రుతులు చోటు చేసుకున్నాయి.

Recommended Video

    Pawan Kalyan Khammam tour : పవన్ కళ్యాణ్‌ పైకి చెప్పు, గందరగోళం : వీడియో

    పవన్ కల్యాణ్ వాహనం దూసుకుపోవడంతో ఎస్సై చిరంజీవి తీవ్రంగా గాయపడ్డారు. ఖమ్మం శివారులో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. బందోబస్తు విధుల్లో ఉన్న చిరంజీవి ఎడమ పాదంపై పై నుంచి పవన్ కల్యాణ్ వాహనం దూసుకుపోయింది.

     ఫ్యాన్స్‌ను అదుపు చేస్తుండగా...

    ఫ్యాన్స్‌ను అదుపు చేస్తుండగా...

    పవన్ కల్యాణ్ వాహనంపై అభిమానులు దూసుకు రావడంతో వారిని అడ్డగించడానికి ఎస్సై చిరంజీవి ప్రయత్నించారు. ఆ సమయంలో ఆయన గాయపడ్డారు. అక్కడ ఉన్నవారు చిరంజీవిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

     పవన్ వాహనం ఆగలేదు..

    పవన్ వాహనం ఆగలేదు..

    ప్రమాదం జరిగిన స్థలంలో పవన్ కల్యాణ్ వాహనం ఆగలేదు. చిరంజీవి గాయపడిన విషయం పవన్ కల్యాణ్‌కు ఖమ్మం వెళ్లే వరకు తెలియదని అంటున్నారు. ఖమ్మం చేరుకున్న తర్వాత ఆయనకు ఆ విషయం చెప్పారు.

     దాంతో అసిస్టెంట్‌ను పంపించి...

    దాంతో అసిస్టెంట్‌ను పంపించి...

    ప్రమాదం గురించి తెలిసిన తర్వాత పవన్ కల్యాణ్ చిరంజీవి వద్దకు తన సహాయకుడిని పంపించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, ఉత్తమమైన చికిత్సకు హైదరాబాదులో రావాల్సిందిగా చెప్పాలని పవన్ తన సహాయకుడికి చెప్పి పంపించారు.

     పవన్ కాన్వాయ్‌పైకి చెప్పు.

    పవన్ కాన్వాయ్‌పైకి చెప్పు.

    కొత్తగూడెం నుంచి ఖమ్మం వెళ్తున్న సమయంలో తల్లాడ జంక్షన్ వద్ద పవన్ కల్యాణ్ వాహనంపైకి ఆగంతకుడు బాటు విసిరాడు. ఆ సంఘటన కాస్తా ఉద్రిక్తతకు దారి తీసింది. పరిస్థితి చేయి దాటకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+