వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చప్పట్లు కొట్టిందీ మీరే, చేయని తప్పుకు విడిపోయాం, భయపడాలి: బాబుకు పవన్

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు మీడియా సమావేశం అనంతరం పవన్.. సోషల్ మీడియా ద్వారా ప్రతిస్పందించారు.

|
Google Oneindia TeluguNews

విశాఖ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు మీడియా సమావేశం అనంతరం పవన్.. సోషల్ మీడియా ద్వారా ప్రతిస్పందించారు.

ఆర్కే బీచ్.. పవన్ కళ్యాణ్ చేతుల్లోకి, జగన్‌కు అది మైనస్!ఆర్కే బీచ్.. పవన్ కళ్యాణ్ చేతుల్లోకి, జగన్‌కు అది మైనస్!

చంద్రబాబు గతంలో అన్న మాటలను గుర్తు చేశారు

ప్రత్యేక హోదా అయిదేళ్లు కాదు.. పదిహేను ఏళ్లు ఇచ్చినా సరిపోదన్న మీరే (చంద్రబాబు), హోదా ఏం సంజీవిని కాదు అద్భుతాలు చేయడానికి అన్నది మీరే, హోదాను మించింది ప్యాకేజీ అని చప్పట్లు కొట్టింది మీరే, ప్యాకేజీకి చట్టబద్దత కల్పిస్తామని చెప్పింది మీరే, అసలు చట్టబద్దత అవసరం లేదంటున్నది మీరే, మీరు ఇన్ని అన్నప్పుడు మా ప్రజలు విన్నారు.. మరి మా ప్రజల ఆక్రోశం, ఆవేదన కనీసం ఒక్కసారైనా చెప్పుకునే అవకాశమివ్వకుంటే ఎలా అని ప్రశ్నించారు.

pawan kalyan

చేయని తప్పుకు ద్వేషంతో విడిపోవాల్సి వచ్చింది

పాలకులు, పాలక వర్గాలు యాభై ఏళ్లుగా వారి వారి పార్టీల ప్రయోజనాల కోసం చేసిన స్వార్థపూరిత కుట్రలకు, ఏ తప్పు చెయ్యని జనం ద్వేషంతో విడిపోవాల్సి వచ్చిందని రాష్ట్ర విభజనను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఆయన రావాలి: రామచంద్రయ్య, మరి ఎలా.. నాశనం చెయ్యడమే: పవన్ కళ్యాణ్ఆయన రావాలి: రామచంద్రయ్య, మరి ఎలా.. నాశనం చెయ్యడమే: పవన్ కళ్యాణ్

నిర్లక్ష్యపు విభజన

ఆ నిర్లక్ష్యపూరిత విభజన పద్ధతికి వచ్చిన నష్టాలను అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారన్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో కూడా గత మూడేళ్లుగా మళ్లీ అలాంటి ధోరణి అవలంభిస్తూ, మా ప్రజలను ఇంకెంత కాలం నిరాశ, నిస్పృహలోకి నెడతారని ప్రశ్నించారు.

డీజీపీ హెచ్చరికలు డోంట్ కేర్: పవన్ కంటే మరో అడుగు జగన్ ముందు!డీజీపీ హెచ్చరికలు డోంట్ కేర్: పవన్ కంటే మరో అడుగు జగన్ ముందు!

న్యాయం కంటే భవిష్యత్తు..

ఇప్పుడు చేస్తున్న పోరాటం వల్ల వెంటనే న్యాయం జరుగుతుందా లేదా అనేకంటే, భవిష్యత్తు తరాల్లో ఇలాంటి నీచ రాజకీయాలు చెయ్యాలంటే భయపడాలని, జనసేన పోరాటం తాలుకూ అంతిమ లక్ష్యం అదే అన్నారు. చివరలో.. దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.

English summary
Jana sena chief Pawan Kalyan on Wednesday clarified what Jana Sena is expecting from RK beach protest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X