భవిష్యత్తు వ్యూహం: బిజెపి వైఖరినే పవన్ కళ్యాణ్ చెప్పారా?

హైదరాబాద్: ఓటుకు నోటు కేసు విషయంలోనే కాకుండా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన తాజా రాజకీయ పరిణామాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలు బిజెపి వైఖరిని ప్రతిబింబిస్తున్నాయనే మాట వినిపిస్తోంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 8 అవసరం లేదని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పడం బిజెపికి కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి కొద్ది కాలం క్రితం అదే మాట అన్నారు.

వచ్చే హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ తన ప్రసంగ పాఠాన్ని తయారు చేసుకున్నట్లు కనిపిస్తోంది. దానికితోడు, ఆయన సనత్ నగర్ శాసనసభా స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో తలపడుతారనే మాట కూడా వినిపిస్తోంది. బిజెపి మద్దతుతో పవన్ కళ్యాణ్ ఆ స్థానంలో పోటీ చేసినా ఆశ్చర్యం లేదు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనూ, ఇతర విషయాల్లోనూ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడినే కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కూడా పవన్ కళ్యాణ్ తప్పు పట్టారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వ్యవహారశైలిని తప్పు పట్టడం ద్వారా వచ్చే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రయోజనం పొందాలనే ఉద్దశంతో బిజెపి ఉన్నట్లు తెలుస్తోంది.

Pawan Kalyan stand: BJP version on cash for vote case

నోటుకు ఓటు కేసు నేపథ్యంలో తెలంగాణ బిజెపి తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకోవాలని భావిస్తోంది. అయితే, పవన్ కళ్యాణ్‌తో స్నేహాన్ని బలంగా తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్లు అర్థమవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీతో తనకున్న సాన్నిహిత్యం కారణంగా పవన్ కళ్యాణ్ బిజెపితో కలిసి పని చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.

హైదరాబాదులో సెక్షన్ 8ను అమలు చేయాల్సిన పరిస్థితి లేదని బిజెపి నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు. దానికన్నా ముందుకు వెళ్లి, సెక్షన్ 8ను అమలు చేసి తెలంగాణ ప్రజల ఆనందాన్ని లాక్కోవద్దని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ రకంగా ఆయన హైదరాబాదులోని తెలంగాణ ప్రజల అభిమానాన్ని చూరగొనాలనే ప్రయత్నం చేసినట్లు భావిస్తున్నారు.

నోటుకు ఓటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్టుపై కూడా బిజెపి వ్యాఖ్యలు చేయడం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుందనే వైఖరిని అవలంబిస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొత్తంగా, ప్రస్తుత పరిణామాలను పవన్ కళ్యాణ్, బిజెపి నేతలు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో ఉన్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+