నేడు గాంధీభవన్‌లో ఉత్తమ్ ఒకరోజు దీక్ష, రైతులకు నష్టపరిహారం కోసం పట్టు...

రైతు సమస్యలపై ఒక్కరోజు దీక్ష చేస్తానని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతుల నుంచి పంట సేకరణ, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని తెలిపారు. అన్నదాత సమస్యల పరిష్కారం కోసం మంగళవారం ఒక్కరోజు గాంధీభవన్‌లో దీక్ష చేస్తానని ప్రకటించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగుతోందని.. తమ పార్టీ నేతలు కూడా దీక్ష చేస్తారని చెప్పారు.

 pcc chief uttam one day agitation at gandhibhavan..

రైతుల ధాన్యం కొనుగోళ్లలో రకరకాల సమస్యలు ఉన్నాయని చెప్పారు. బస్తాల కొరత చూపించి విక్రయాలు నిలిపివేశారని ఉత్తమ్ ఆరోపించారు. తాలు పేరుతో నిలువుదోపిడి చేస్తున్నారని ఫైర్యారు. బస్తాకు 6 నుంచి 8 కిలోలు కోత కోస్తున్నారని మండిపడ్డారు. రైస్ మిల్లర్ల ఆగడాలు మితీమిరాయని... ఆరోపించారు.

రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటకు వెంటనే డబ్బులు ఇవ్వాలని కోరారు. నష్టపోయిన పంటకు పరిహారం ఇవ్వాలని కోరారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలనే పేరుతో తన దీక్ష కొనసాగుతోందని చెప్పారు. జిల్లా కార్యాలయాల వద్ద డీసీసీ అధ్యక్షులు కూడా దీక్ష చేస్తారని.. అయితే సామాజిక దూరం పాటించాలని కోరానని ఉత్తమ్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+