Leopard: జగిత్యాల జిల్లాలో చిరుత సంచారం.. ఆందోళనలో ప్రజలు.. !

తెలంగాణలో నిత్యం ఏదో చోట చిరుత(Leopard) పులులు తిరుగుతున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా, మల్లాపూర్ మండలం సంగెం, ఓబులాపూర్ గ్రామాల మధ్య చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. గత వారం రోజులుగా చుట్టు ప్రక్కల ప్రాంతాలలో చిరుత పులులు ఎక్కువగా తిరుగుతున్నయని సంగెం, ఓబులాపూర్ గ్రామస్తులు చెబుతున్నారు.

ఓబులాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతుకు పొలం వద్దగా వెళ్తుండా చిరుత కనిపించిందని చెప్పారు. ఈ విషయాన్ని వెంటనే గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అయితే ఈ ప్రాంతంలో చిరుత తిరుగుతుందని అటవీ అధికారులు ప్రకటించలేదు. ఎందుకైన మంచిదని ముందు జాగ్రత్తగా చుట్టు పక్కల గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

People are worried about the movement of leopards in jagtial district

చిరుత సంచారం పై ఫారెస్ట్ అధికారులు విచారణ చేస్తున్నారు. పలు చోట్ల కెమెరాలు కూడా అమర్చుతున్నట్లు తెలిసింది. చిరుత ఉన్నట్లయితే దాన్ని బంధించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 8న రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండలంలో చిరుత పులి సంచారించింది. నాగంపేట గ్రామంలో చిరుత పులి ఓ గేదెపై దాడి చేసింది. పంగ బాబు అనే రైతు తన చేను వద్ద గేదెను కట్టేశాడు. చిరుత పులి దాడిలో గేదె తీవ్రంగా గాయపడింది.

నాలుగు రోజుల క్రితం హైద‌రాబాద్ శివారులో చిరుత సంచారం క‌ల‌క‌లం సృష్టించింది. బౌరంపేట ఓఆర్ఆర్ ప్రాంతంలో చిరుత కదలకలు కనిపించాయి. సీసీ కెమెరా ల్లో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు రికార్డు కావడంతో అటవీశాఖ అధికారులుఅప్రమత్తమయ్యారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భౌరంపేట, ఔటర్ రింగ్ రోడ్డు వద్ద శివారులో చిరుత సంచరిస్తోందని సీసీటీవీ కెమెరాల్లో దృశ్యాలు కనిపించాయంటూ ఆ వీడియోను అధికారులకు పంపారు. దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు చిరుత కోసం వేట మొదలు పెట్టారు.

గతేడాది డిసెంబర్ లో సంగారెడ్డి జిల్లాలోనూ ఓ చిరుత హెటిరో పరిశ్రమలో చిరుత ప్రవేశించింది. సంగారెడ్డి జిల్లా జిన్నారం (మం) గడ్డపోతారం పారిశ్రామిక వాడలో Hetero పరిశ్రమలోకి చిరుత వెళ్లింది. Hetero పరిశ్రమలో హెచ్ బ్లాక్ లో దాగి ఉన్న చిరుతను అటవీ శాఖ సిబ్బంది పట్టుకున్నారు. చిరుతకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బోన్ లో బంధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+